AP CM Ys Jagan Letter: ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ కీలకాంశాల్ని లేవనెత్తారు. ఆక్సిజన్ సరఫరా, కేటాయింపులతో సహా..వ్యాక్సిన్ పేటెంట్ డీ లైసెన్సింగ్ విషయంపై మాట్లాడారు. ప్రదాని మోదీకు లేఖ రాశారు. లేఖలో ఇంకా ఏం రాశారంటే..
దేశంలో, వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులు, వ్యాక్సిన్ కొరత(Vaccine Shortage) నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan) ప్రస్తావించిన అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరా అంశాల్ని ప్రస్తావించారు.వ్యాక్సిన్ పేటెంట్‌కు సంబంధించి డీ లైసెన్సింగ్ చేసే అంశాన్ని చర్చించారు. అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకు లేఖ రాశారు.
రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధాని మోదీ(Pm Modi)కు రాసిన లేఖలో కోరారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని..అది ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ప్రస్తుతానికి తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని వైఎస్ జగన్ చెప్పారు. ఈ నెల 10 న చెన్నై, కర్ణాటక నుంచి రావల్సిన ఆక్సిజన్ ఆలస్యమైన కారణంగా తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న...20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్ టన్నులకు పెంచాలని లేఖలో కోరారు. ప్రస్తుతం ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న...210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 4 వందల మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు.
ఇక కీలకమైన వ్యాక్సిన్ ఉత్పత్తి ,పేటెంట్ (Vaccine patent) విషయాలపై మాట్లాడారు. భారత్ బయోటెక్ కంపెనీకు చెందిన కోవ్యాగ్జిన్ (Covaxin) ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించారని లేఖలో తెలిపారు.పేటెంట్ డీలైసెన్సింగ్ ( Patent Delicensing) చేయడం ద్వారా ఉత్పత్తి పెంచవచ్చని సూచించారు.పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి అన్నారు. భారత్ బయోటెక్ ( Bharat Biotech) కంపెనీ వ్యాక్సిన్ పేటెంట్లో ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా భాగస్వామ్యులని గుర్తు చేశారు.
Also read: AP Corona Update: ఏపీలో ఆగని కరోనా ఉధృతి, పెరిగిన కేసుల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook