Jagananna Smart Township: మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు, ఇవాళ్టి నుంచి దరఖాస్తులు

Jagananna Smart Township: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి అంకురార్పణ చేశారు. మధ్య తరగతి వర్గాలకు సైతం లబ్ది చేకూర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పేదవాడికీ సొంత ఇళ్లు ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ తెలిపారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2022, 12:55 PM IST
Jagananna Smart Township: మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలు, ఇవాళ్టి నుంచి దరఖాస్తులు

Jagananna Smart Township: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి అంకురార్పణ చేశారు. మధ్య తరగతి వర్గాలకు సైతం లబ్ది చేకూర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి పేదవాడికీ సొంత ఇళ్లు ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పధకం ప్రారంభమైంది. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys jagan) తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. మద్య తరగతివర్గాలకు సైతం ఇళ్ల స్థలాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించారు.

ఈ పధకం ద్వారా మార్కెట్ కంటే తక్కువ ధరకు ప్రభుత్వం స్వయంగా అభివృద్ది చేసిన లే అవుట్లలో ఇళ్ల స్థలాలు అందించనున్నారు. ఈ ఇళ్ల స్థలాల కోసం (Housing Sites)ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. తొలిదశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులలో అమలు చేయనున్నారు. ఆ తరువాత రెండవ దశలో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ పథకం (Jagananna Smart Township) అమలు కానుంది. ఏడాదికి 18 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. అర్హులైనవారికి వారుంటున్న ప్రాంతంలోనే తక్కువ ధరకు స్థలాలు కేటాయించనున్నారు. కంప్యూటరైజ్డ్ పద్ధతి ద్వారా ప్రభుత్వం ప్లాట్లు కేటాయిస్తుంది. ఇందులో150, 200, 240 చదరపు గజాల్లో నచ్చిన మేర ఎంచుకోవచ్చు.

ఆసక్తి కలిగిన, అర్హులైన వ్యక్తులు https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇందులో పది శాతం ప్లాట్లను కేటాయిస్తున్నారు. 20 శాతం తగ్గింపు ధర ఉంటుంది. ప్లాట్ ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన లే అవుట్‌లో 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు , నాణ్యమైన మౌళిక సదుపాయాలు ఉంటాయి. తొలి విడతలో 3 వేల 894 ప్లాట్లను సిద్ధం చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) తెలిపారు.

Also read: Bhogi 2022: భోగి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందామా...!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News