AP: అత్యవసర వాహనాల్ని ప్రారంభించిన సీఎం జగన్

విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ప్రారంభించారు. ముంబై తరువాత ఇటువంటి వాహనాలున్నది ఏపీలోనే ఉండటం గమనార్హం..

Last Updated : Dec 31, 2020, 04:09 PM IST
AP: అత్యవసర వాహనాల్ని ప్రారంభించిన సీఎం జగన్

విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ప్రారంభించారు. ముంబై తరువాత ఇటువంటి వాహనాలున్నది ఏపీలోనే ఉండటం గమనార్హం..

ఎక్కడైనా అగ్నిప్రమాదం కానీ..ప్రకృతి విపత్తు గానీ తలెత్తితే అత్యవరసర సేవలకు ( Emergency services ) వీలుగా 14 వాహనాల్ని ప్రభుత్వం సమకూర్చుకుంది. అటు పోలీసు అత్యవసర సేవల ( Police emergency services  ) కోసం మరో 36 వాహనాలను అందించింది ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) వీటిని ప్రారంభించారు. ఏ విపత్తు జరిగినా అన్ని సదుపాయాలు, ఎక్విప్‌మెంట్‌తో పాటు 20 మంది ఎస్టీఆర్ఎఫ్ టీమ్ వెళ్లేలా ఈ వాహనాలుంటాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్‌కి ఇవి కనెక్ట్ అవుతాయి. ఈ కెెమేరాల ద్వారా ఫీల్డ్‌లో పరిస్థితి ఏంటనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

పోలీసు అత్యవసర సేవల వాహనాల్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Ap Dgp Gautam sawang ) పరిశీలించారు. హై టెక్నాలజీ, సామర్ధ్యం ఈ వాహనాల్లో ఉందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. పడవ, రోడ్డ ప్రమాదాలు తలెత్తినా..ఫైర్ యాక్సిడెంట్లు, భవననాలు కూలినప్పుడు ఈ తరహా వాహనాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ముంబై తరువాత దేశంలో ఈ తరహా వాహనాలు ఏపీలోనే ఉన్నాయన్నారు. 

Also read: SSC Exams 2021 updates: 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ అప్‌డేట్స్

Trending News