AP Caste Census 2024: ఏపీలో కులగణన రేపట్నించి ప్రారంభం, ఎలా జరుగుతుందంటే

AP Caste Census 2024: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కులగణన కార్యక్రమం రేపట్నించి ప్రారంభం కానుంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో 10 రోజులపాటు జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2024, 11:08 AM IST
AP Caste Census 2024: ఏపీలో కులగణన రేపట్నించి ప్రారంభం, ఎలా జరుగుతుందంటే

AP Caste Census 2024: దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన బీహార్ రాష్ట్రం తరువాత ఇప్పుడు ఏపీలో కులగణన జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు సచివాలయాల్లో ప్రయోగాత్మకంగా సర్వే పూర్తి కాగా ఇక పూర్తి స్థాయి కులగణన రేపట్నించి ప్రారంభం కానుంది. 

దేశంలో కులగణన అనేది చాలా ముఖ్యం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు కులగణన చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా కొత్త పథకాల రూపకల్పనకు సైతం ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో గ్రామ, వార్డు స్థాయి సచివాలయాల ద్వారా సేకరించిన డేటా ప్రకారం గ్రామాల్లో మొత్తం 1 కోటి 23 లక్షల 440 వేల 422 మంది కుటుంబాలు, 3 కోట్ల 56 లక్షల 62 వేల 251 మంది నివాసమున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో 44 లక్షల 44 వేల 887 కుటుంబాలు, 1 కోటి 33 లక్షల 16 వేల 91 మంది ఉన్నారు. 

రేపట్నించి పదిరోజులపాటు సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరి వివరాలు సేకరించనున్నారు. ఈ నెల 28 వరకూ ఈ కార్కక్రమం కొనసాగనుంది. కులగణనలో మిగిలిపోయిన వారి కోసం మరో 5 రోజులు కేటాయించనున్నారు. చివరిగా రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు, జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉంటుంది. 

దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపుగా 723 కులలా జాబితాను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా వర్గీకరించి మొబైల్ యాప్స్ రూపంలో అనుసంధానించారు. ఈ కులగణన ప్రక్రియలో నో క్యాస్ట్ ఆప్షన్ కూడా ఉండనే ఉంది. అంటే కులం గురించి చెప్పడం ఇష్టం లేనివాళ్లు, కుల పట్టింపులు లేనివాళ్లు నో క్యాస్ట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. డేటా ఎంట్రీ అనంతరం కుటుంబంలో ఒకరి నుంచి ఆధార్ కార్డుతో ఈ కేవైసీ తీసుకుంటారు. 

Also read: Balineni vs Ys Jagan: కొలిక్కి వచ్చిన బాలినేని పంచాయితీ, మాగుంటకు నో చెప్పేసిన జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News