ఏపీ బడ్జెట్ తేది ఖరారు - మార్చి 8న రాష్ట్ర బడ్జెట్

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 

Last Updated : Feb 16, 2018, 11:44 PM IST
ఏపీ బడ్జెట్ తేది ఖరారు - మార్చి 8న రాష్ట్ర బడ్జెట్

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతిలో వివిధ శాఖల అధిపతులు, కార్యదర్శులు, మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బడ్జెట్ ప్రణాళికను సమీక్షించారు. బడ్జెట్‌‌ను ఎలా రూపకల్పన చేయాలి లాంటి అంశాలను చర్చలో ప్రస్తావించారు.

ఆఖరికి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2018ను ప్రవేశపెట్టక ముందు.. మార్చి 5న ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్ ప్రసంగిస్తారని తెలిపారు. సప్తమి నాడు (గురువారం) మార్చి 8 తేదిన ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామక్రిష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశబెట్టనున్నారు.

నిన్నే అమరావతి సచివాలయం బ్లాక్ 2లో ఆర్థికమంత్రి వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్, పశుసంవర్ధక, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బడ్జెట్‌ను మార్చిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

జీ న్యూస్ ప్రజావేదికలో మీరూ  పాల్గొనండి..!
ఏపీ ప్రభుత్వం ఇంకో పాతిక రోజులలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా కేటాయింపులు చేయాలో.. ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుపుతూ మీ సలహాలు, సూచనలు అందివ్వండి.. జీ న్యూస్ ఫేస్‌బుక్ పేజీలో మీ అభిప్రాయాలు పంచుకోండి

 

Trending News