ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం

Kanna Lakshminarayana Daughter In Law Dies | ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. పార్టీ చేసుకునేందుకు వెళ్లిన ఆయన కోడలు సుహారిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

Last Updated : May 29, 2020, 01:15 PM IST
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం

Suharika Reddy Dies | ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఆయన రెండో కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక(38) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సుహారిక తల్లి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  కొండపోచమ్మ సాగర్‌ను ప్రారంభించిన కేసీఆర్, చినజీయర్ స్వామి

సుహారిక ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్థానికంగా ఉన్న మిత్రుడు పవన్ రెడ్డి ఇంటికెళ్లినట్టు సమాచారం. సోదరి భర్త ప్రవీణ్, వికాస్ నివాస్ , తదితరులతో కలిసి విందు చేశారు. ఏం జరిగింతో తెలియదు కానీ 11:30 గంటలకు సుహారిక ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.  Photos: తెలంగాణలో మహత్తర ఘట్టం

ఆమెను వెంటనే రాయదుర్గంలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. తన కూతురు ఆకస్మిక మరణంపై సుహారిక తల్లి సాగరిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నెల్లూరుకు చెందిన సుహారిక, ఫణీంద్రలది ప్రేమ వివాహం కావడం గమనార్హం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News