AP: స్పీకర్ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో కారు బోల్తా పడకుండా కంట్రోలైనట్టు తెలుస్తోంది.

Last Updated : Nov 21, 2020, 04:01 PM IST
AP: స్పీకర్ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో కారు బోల్తా పడకుండా కంట్రోలైనట్టు తెలుస్తోంది.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ( Ap Assembly speaker Tammineni Sitaram )కు తృటిలో ప్రాణపాయం తప్పింది. రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇవాళ ప్రపంచ ముత్స్యకార దినోత్సవం సందర్బంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ( Srikakulam Collectorate ) లో జరిగిన కార్యక్రమానికి తమ్మినేని హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో..వంజంగి వద్ద తమ్మినేని కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోకి ఓ ఆటో వేగంగా దూసుకురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో..చాకచక్యంగా కారును పక్కకు లాగేయగలిగాడు. దాంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే కారు బోల్తా పడి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. Also read: AP: తీరప్రాంత అభివృద్ధికి చర్యలు, 4 ఫిషింగ్ హార్బర్లకు శంకుస్థాపన

Trending News