ఏపీ అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ వార్

Last Updated : Mar 20, 2018, 01:22 PM IST
ఏపీ అసెంబ్లీలో టీడీపీ-బీజేపీ వార్

ఏపీ అసెంబ్లీలో మంళవారం టీడీపీ-బీజేపీ సభ్యుల మధ్య చర్చ వాడీవేడిగా జరిగింది.  వెనకబడిన జిల్లాల నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు. నిధులు ఎందుకు వెనక్కి తీసకున్నారంటూ బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ స్పందిస్తూ ఇది సాంకేతిపరమైన అంశం మాత్రమేనని. కావాలని చేసిన పనికాదన్నారు. పీఎంవో అనుమతి లేదనే కారణంతో నిధులు వెనక్కి తీసుకున్నారని వివరణ ఇచ్చారు.

విష్ణుకుమార్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. పీఎంవో అనుమతి లేకుంటే నిధులు వెనక్కి తీసుకుంటారా ? అంటూ టీడీపీ సభ్యుడు రవికుమార్ నిలదీశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై కేంద్రానికి శ్రద్ధలేదని ఆయన  విమర్శించారు.

విభజన హామీల అమలు విషయంలో బీజేపీతో టీడీసీ సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిధులు వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు రాష్ట్రంపై బీజేపీ కక్ష సాధింపు దోరణి అవలంభిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.

Trending News