/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Gorantla Madhav:  జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రకంపనలు రేపిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. వైరల్ గా మారిన ఎంపీ గోరంట్ల వీడియో ఒరిజనల్ కాదని.. ఎడిట్ వీడియోను వైరల్ చేశారని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప చెప్పినా రచ్చ చల్లారడం లేదు. ఒరిజనల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామని స్పీ చెప్పడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా ఫేక్ అని నిర్ధారిస్తారని నిలదీసింది. పార్లమెంట్ పరువు తీసేలా వ్యవహరించిన ఎంపీని సస్పెండ్ చేయాలని టీడీపీ సహా విపక్షాలు ఉద్యమం కొనసాగిస్తున్నాయి.

తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. గోరంట్ల వీడియో వివాదం కేంద్ర దర్యాప్థు సంస్థ సీబీఐకి చేరింది. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదును ఈ మెయిల్ ద్వారా సీబీఐ చెన్నై కార్యాలయానికి పంపించారు న్యాయవాది.  తన ఫిర్యాదులో పాటు ఎంపీ గోరంట్లకు సంబంధించిన వీడియోను జత చేసి పంపించారు. ఎంపీ హోదాలో ఉన్న మాధవ్.. మహిళతో న్యూడ్ వీడియోకాల్ లో మాట్లాడిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని ఫిర్యాదులో   లాయర్ లక్ష్మీనారాయణ ఆరోపించారు. అంతేకాదు వీడియో కాల్ లీక్ అయ్యాకా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఎంపీ మాధవ్ కామెంట్లు చేశారని.. ఓ సామాజిక వర్గాన్ని  అప్రదిష్టపాలు చేస్తున్నారని  సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు.గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్లతో అనంతపురం జిల్లాలో రెండు వర్గాల మధ్. విధ్వేషాలు చెలరేగాయని, ఆందోళనలు జరిగియని ఫిర్యాదులో చెప్పారు. వైసీపీ ఎంపీ గోరంట్లపై సీబీఐ సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు లాయర్ లక్ష్మీనారాయణ కోరారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదం అనంతపురం జిల్లాలో కులాల కుంపట్లు రాజేసింది. కమ్మ, కురుబ సామాజికవర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెన్షన్ కొనసాగుతుండగానే జిల్లాకు వచ్చారు ఎంపీ గోరంట్ల మాధవ్. తన అనుచరులతో కలిసి హిందూపురంలో ర్యాలీ తీశారు మాధవ్. ర్యాలీలో మాట్లాడిన ఎంపీ గోరంట్ల.. మరోసారి టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు ఆడియోను అమెరికా ల్యాబ్‌లో టెస్ట్‌ చేయించి.. అది ఫేక్ అని ఆ నేతలు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. బీసీ నేతలను అనగదొక్కేందుకే తనపై విష ప్రచారం చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. ఒరిజినల్ వీడియో ఉందని చెప్పి బాంబ్ పేల్చారు గోరంట్ల మాధవ్.  ఒరిజినల్ వీడియో దొరికితే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తామని జిల్లా ఎస్పీ చెప్పగా..  ఇప్పుడు గోరంట్ల మాధవే తన దగ్గర ఒరిజనల్ వీడియో ఉందని చెప్పడంతో.. పోలీసులు ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిజాలు రాబట్టాలనే డిమాండ్ వస్తేంది. 

Read also: Nashik Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం.. గంట వ్యవధిలో మూడుసార్లు...  

Read also: ఒకేసారి 7 లక్షల మంది దండయాత్ర.. వెబ్‌సైట్ క్రాష్! హాట్‌కేకుల్లా అమ్ముడైన భారత్‌-పాక్‌ మ్యాచ్ టికెట్లు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
AP Advocates Complaint on MP Gorantla Madhav Nude Video Case To CBI
News Source: 
Home Title: 

Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ట్విస్ట్.. న్యూడ్ వీడియోపై సీబీఐ విచారణ? వైసీపీలో కలవరం

Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ట్విస్ట్.. న్యూడ్ వీడియోపై సీబీఐ విచారణ? వైసీపీలో కలవరం
Caption: 
FILE PHOTO mp gorantla madhav
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఎంపీ గోరంట్ల వ్యవహారంలో మరో మలుపు

సీబీఐకి ఫిర్యాదు చేసిన ఏపీ న్యాయవాది

సమగ్ర విచారణ జరపాలని వినతి

Mobile Title: 
Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ట్విస్ట్.. న్యూడ్ వీడియోపై సీబీఐ విచారణ?
Srisailam
Publish Later: 
No
Publish At: 
Wednesday, August 17, 2022 - 08:00
Request Count: 
189
Is Breaking News: 
No