AP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులు

AP Summer Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారుతోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2024, 07:21 AM IST
AP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులు

AP Summer Updates: ఏపీలో రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోననే భయం వెంటాడుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ తీవ్రమైన వడగాల్పుల హెచ్చరిక జారీ అయింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంటోంది. నంద్యాలలో నిన్న బుధవారం అత్యధికంగా 45 డిగ్రీలు నమదైంది. ఇక విజయనగరం జిల్లా జామిలో 44.9 డిగ్రీలు రికార్డయింది. కడపలో గరిష్టంగా 44.2 డిగ్రీలు నమోదైతే అనకాపల్లిలో అత్యదికంగా 44.1 డిగ్రీలు నమోదయింది. ఇక అనంతపురం జిల్లాలో కూడా అత్యదికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో రోజూ ఉన్నట్టే 43 డిగ్రీలు దాటుతోంది. దాదాపు వారం రోజుల్నించి ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా ఉండటమే కాకుండా తీవ్రమైన వడగాల్పులు భయపెడుతున్నారు. 

ఇవాళ కూడా వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక రేపు అంటే గురువారం కూడా 47  మండలాల్లో తీవ్రంగానూ, 109 మండలాల్లో సాధారణంగానూ వడగాల్పులుంటాయని తెలిపింది. తూర్పు గోదావరి జిల్లాలో 19, కాకినాడలో 18, కోనసీమలో 9, అనకాపల్లిలో 15, ఏలూరులో 12, కృష్ణాలో 6, ఎన్టీఆర్ జిల్లాలో 5, గుంటూరులో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 మండలాల్లో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. 

వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటున్నందున ఉదయం 11 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, రోగులు ఇంట్లోనే ఉండాలంటున్నారు. సాధ్యమైనంతవరకూ మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్, నిమ్మరసం వంటివి తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలంటున్నారు. 

Also read: Anaparthy Politics: ఏపీలో విచిత్ర రాజకీయాలు, టికెట్ కోసం అభ్యర్ధుల్ని మార్చుకుంటున్న పార్టీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News