AP Govt 20 Lakhs Exgratia To Geethanjali Family: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలలో ద్వారా లబ్ధిదారులు పొందిన ఆనందాన్ని వెల్లడిస్తుంటారు. అచ్చం ఇలా ఒక మహిళ తన ఆనందాన్ని పంచుకోవడమే ఇక్కడ పాపమైంది. ఆమె తనకు పథకం వచ్చిందని చెప్పడంను కొన్నిపార్టీల వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఇటీవల తెనాలిని ఇస్టాంపేటకు చెందిన గీతాంజలి అనే మహిళకు ప్రభుత్వం ఇటీవల ఇంటి స్థలం మంజూరు చేసింది. ఇంటిపట్టాను స్థానిక ఎమ్మెల్యే నుంచి అందుకున్న గీతాంజలి తెగ ఆనందపడిపోయింది.
సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు లబ్దిదారులకు అందాయని, దీనిపై ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని, మరోసారి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలంతా ఆయనకే ఓటు వేయాలని కూడా సంతోషంగా మాట్లాడింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు తెగ వైరల్ గా మారాయి. ఇది సీఎం జగన్ కు ఎక్కడ మంచిపేరు తీసుకొస్తాయో.. అనుకున్నారో.. మరేంటో కానీ.. మహిళను సోషల్ మీడియా వేదికంగా ఘోరంగా ట్రోల్ చేశారు.
పాపం.. మహిళా అని కూడా చూడకుండా.. నోటికొచ్చినట్లు బూతులతో చెలరేగిపోయారు. దీంతో ఆ కామెంట్లు చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురైన గీతాంజలి తెనాలి రైల్వేస్టేషన్ కు వెళ్లి సూసైడ్ కు పాల్పడింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదంగా మారింది. పార్టీలకు అతీతంగా ఈ ఘటనపట్లు అందరు స్పందిచారు. ఈ ఘటన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్లింది. దీనిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వెంటనే బాధితకుటుంబానికి తన సంతాపం తెలియజేశారు. అంతేకాకుండా రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం సబబు కాదన్నారు. మహిళలపై ట్రోలింగ్ కు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకొవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి మరణంపై కేసు నమోదు చేసుకున్క పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook