టీవీలో ఏపి 10వ తరగతి ఫలితాలు : పాఠ‌శాల విద్యాశాఖ‌

ఏపిలో 10వ తరగతి ఫలితాలు టీవీలో చూసుకోవచ్చు

Last Updated : May 13, 2019, 01:35 PM IST
టీవీలో ఏపి 10వ తరగతి ఫలితాలు : పాఠ‌శాల విద్యాశాఖ‌

అమరావతి: ఏపీలో 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు మంగళవారం ఉద‌యం 11 గంట‌ల‌కు విడుదల కానున్నాయి. రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారిక వెబ్‌సైట్, పీపుల్‌ ఫ‌స్ట్ మొబైల్ యాప్‌, ఖైజాలా యాప్‌, ఫైబ‌ర్ నెట్ టీవీల్లోనూ ఫలితాలను పరిశీలించుకోవచ్చని పాఠ‌శాల విద్యాశాఖ‌ ప్రకటించింది. ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ ఉన్న వినియోగదారులు టీవీల్లోనూ విద్యార్థి హాల్ టికెట్ నెంబ‌రు టైపు చేయ‌గానే ఫ‌లితాలు కనిపించేలా ఏర్పాట్లు చేసినట్టు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు తెలిపారు. 

www.rtgs.ap.gov.in, https://bit.ly/2E1cdN7, https://aka.ms/apresult వెబ్‌సైట్ లింక్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవ‌చ్చని పాఠ‌శాల విద్యాశాఖ‌ అధికారులు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

Trending News