AP Postal Ballot Votes: రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. రాజకీయ పార్టీల్లో కలవరం

Postal Ballot Votes New Records In Andhra Pradesh Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేశారు. తమకు దక్కిన అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకుండా ఉద్యోగులందరూ ఓట్లు గంపగుత్తగా వేశారు. అయితే బ్యాలెట్‌ ఓటర్లు ఎవరి తరఫున ఉన్నారనేది ఉత్కంఠ నెలకొంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 24, 2024, 10:54 PM IST
AP Postal Ballot Votes: రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. రాజకీయ పార్టీల్లో కలవరం

AP Election Results: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్లతోపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అంతకుమించి నమోదయ్యాయి. పోస్టల్‌ బ్యాటింగ్‌ ఓట్ల నమోదులో కొత్త రికార్డు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కల ప్రకారం 5 లక్షల 39వేల 189 ఓట్లు పోలయ్యాయి. ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Also Read: AP Election Results: వైఎస్‌ జగన్‌కు భారీ మెజార్టీనా? పవన్‌ కల్యాణ్‌కా?.. కాయ్‌ రాజా కాయ్‌

 

రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయని తెలిసింది. రెండో స్థానంలో నంద్యాల జిల్లాలో 25,283, మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు పోలయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలోనే అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు పోలవడం గమనార్హం. ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావడంతో ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలనే దానిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.

Also Read: Election Counting: ఆంధ్రప్రదేశ్‌ ఓట్ల లెక్కింపుపై ఈసీ దృష్టి.. మళ్లీ హింస చెలరేగకుండా పటిష్ట చర్యలు

 

ఓట్ల లెక్కింపు ఇలా..
ఒక్కో టేబుల్‍లో ఎన్ని లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం పంపించింది. అయితే పోస్టల్ బ్యాలెట్ విషయమై తెలుగుదేశం పార్టీ ఒక విజ్ఞప్తి చేసింది. 'పోస్టల్‌ బ్యాలెట్‌ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి' అని కోరింది. అయితే అధికారికంగా స్పందించకపోయినా మౌఖికంగా ఈసీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్‍దే అని విపక్షాలు చెబుతున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లు భారీగా నమోదవడంతో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కలవరం మొదలైంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా బ్యాలెట్‌లలో ప్రభుత్వ ఉద్యోగులు వేసి ఉంటారని వైసీపీ ఆందోళన చెందుతోంది. బ్యాలెట్‌ ఓట్లే కాదు సాధారణ ఓటర్లు కూడా తమకు మద్దతు తెలిపి ఉంటారని కూటమి భావిస్తోంది. బ్యాలెట్‌ ఓటర్లు ఎటు వైపు ఉన్నారనేది జూన్‌ 4వ తేదీన తేలనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News