AP Politics: గుంటూరు పార్లమెంట్ బరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్‌తో కొత్త సమీకరణాలు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు పార్లమెంట్ బరిలో సమీకరణాలు మారనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2024, 11:48 AM IST
AP Politics: గుంటూరు పార్లమెంట్ బరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

AP Politics: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలుగుదేశం-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల హాట్ టాపిక్ గా మారి అసంతృప్తులు, వ్యతిరేకతలకు దారితీస్తోంది. మరోవైపు అధికార పార్టీ గుంటూరు జిల్లా రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అసలేం జరుగుతోందంటే..

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి గుంటూరుపై ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అధికార పార్టీ గంజి చిరంజీవిని ప్రకటించడంతో అలిగి పార్టీ వీడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..నెలరోజుల్లోనే తిరిగి సొంతగూటికి వచ్చేశారు. వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న వైఎస్ జగన్ సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాల్నే సిద్ధం చేస్తున్నారు. సర్వే అనుకూలంగా లేకుండా ఎంత సన్నిహితులు, బంధువులైనా పక్కనపెట్టేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేల్ని పార్లమెంట్ బరిలో, కొందరు ఎంపీల్ని అసెంబ్లీ బరిలో దించుతున్నారు. గుంటూరులో ఇప్పుడు అదే జరుగుతోంది. 

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తిరిగి సొంతగూటికి చేరడంతో ఆయనకు ఎక్కడ స్థానం కల్పిస్తారనే చర్చ వస్తోంది. మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని మార్చే అవకాశం లేదు. కానీ గుంటూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా వైఎస్ జగన్ ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటరమణ మొన్నటి వరకూ పార్టీ కార్యక్రమాల్ని చురుగ్గానే నిర్వహించారు. కానీ గత 2-3 రోజుల్నించి ఉమ్మారెడ్డి వెంకట రమణ కన్పించడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కేను ఈసారి గుంటూరు పార్లమెంట్ బరిలో దించవచ్చనే వార్తలు వ్యాపిస్తున్నాయి. మరి ఆర్కే ఇందుకు అంగీకరిస్తారా లేదా , ఒకవేళ అంగీకరించినా ఉమ్మారెడ్డి వెంకటరమణకు ఏం చెబుతారనేది అలు ప్రశ్న. అలాగని ఆర్కేనే తిరిగి మంగళగిరి నుంచి దించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

Also read: RGV Satires: పవన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్న ఆర్జీవీ, ఎక్స్ పోస్ట్‌లు వైరల్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News