Ys jagan Target: వైఎస్ జగన్ టార్గెట్ ఆ స్థానాలే, విజయమే లక్ష్యంగా ఎత్తుగడలు

Ys jagan Target: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2024, 01:44 PM IST
Ys jagan Target: వైఎస్ జగన్ టార్గెట్ ఆ స్థానాలే, విజయమే లక్ష్యంగా ఎత్తుగడలు

Ys jagan Target: ఏపీ ఎన్నికల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిగా సిద్ధం కాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతోంది. అభ్యర్ధుల్ని సమూలంగా మారుస్తుండటంతో అసంతృప్తులు పార్టీ వీడుతున్నారు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. 

ఏపీలో వైనాట్ 175 లక్ష్యం పెట్టుకోవడమే కాకుండా కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించారు వైఎస్ జగన్. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భావిస్తున్న పిఠాపురం, అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నటెక్కలి, నిమ్మల రామానాయుడు పోటీచేస్తున్న పాలకొల్లు స్థానాలపై వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటితోపాటు వైసీపీ నుంచి టీడీపీ తీర్ధం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న స్థానాలపై గురి పెట్టారు. ఇందులో భాగంగానే నెల్లూరు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించిన విజయసాయిరెడ్డికి కొన్ని సూచనలు జారీ చేశారు జగన్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డిలు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించినట్టు సమాచారం.

ఇక కుప్పంపై చాలాకాలం నుంచి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కుప్పం మున్సిపాలిటీని గెలిచినప్పట్నించి ఆ ఫోకస్ మరింత పెరిగింది. మంగళగిరిలో నారా లోకేశ్‌ను ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్కేను కాదని గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించిన జగన్ తాజాగా అతనిని తప్పించి మురుగుడు లావణ్యను ఇన్‌చార్జిగా నియమించారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని భావిస్తున్న పిఠాపురంను చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. 

అందుకే ఇక్కడి ఎమ్మెల్యే పెండెం దొరబాబును తప్పించి వంగా గీతకు బాధ్యతలు అప్పగించారు. తాజాగా ముద్రగడను బరిలో దించుతారనే వాదన విన్పిస్తోంది. ఇక అదే సమయంలో టెక్కలి నుంచి కూడా అచ్చెన్నాయుడిని ఓడించేందుకు పూర్తిగా ఫోకస్ పెడుతున్నారని సమాచారం. 

Also read: AP Elections 2024: వైసీపీలో మళ్లీ మార్పులు, రాజుకుంటున్న అసంతృప్తి, అసలేం జరుగుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News