AP: కోటి మందికి వ్యాక్సిన్.. ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

Corona Vaccine  | ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారతదేశంలో కూడా ఈ వ్యాక్సిన్ లభించే అవకాశం ఉంది. 

Last Updated : Dec 16, 2020, 07:50 PM IST
    1. ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.
    2. త్వరలో భారతదేశంలో కూడా ఈ వ్యాక్సిన్ లభించే అవకాశం ఉంది.
AP: కోటి మందికి వ్యాక్సిన్.. ఏర్పాట్లు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

Covid-19 Vaccine | ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనావైరస్ వ్యాక్సిన్ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో భారతదేశంలో కూడా ఈ వ్యాక్సిన్ లభించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో దాన్ని ఎలా పంపిణి చేయాలో అనేది విషయంపై కొంత కాలం క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు.

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్ పంపిణికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు ఏపి ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైరస్‌ను నిలువరించే వ్యాక్సిన్‌ను పంపిణి చేయడానికి తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ డిసెంబర్ 25, 2021 నుంచి ప్రారంభం అవుతుంది అని తెలిపారు.

ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ? 

డిసెంబర్ 25,2021 నుంచి అధిక సంఖ్యలో టీకా వేసే ప్రక్రియను మొదలుపెడతారు అని పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి సమాచారం అందించారు. మొత్తం 4762 ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు అందించాలని ప్లాన్ చేశారు అని వివరించారు. అయితే ట్విట్ చేసిన తరువాత వెంటనే ట్విటర్ నుంచి ఆ పోస్ట్ డిలీట్ అయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News