Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే

Ap Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేనకు మూడోపార్టీ జత చేరింది. 2024 ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. ఏ పార్టీకు ఎన్ని సీట్లనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2024, 09:49 AM IST
Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే

Ap Elections 2024: త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన ఇప్పటికే కూటమిగా ఏర్పడగా ఇక బీజేపీ చేరిక ఖాయమైంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో జరిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో పొత్తుపై సంయుక్త ప్రకటన విడుదలైంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. అప్పటి ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం-బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన పోటీ చేయకపోయినా ప్రత్యక్షంగా మద్దతిచ్చింది. ఆ తరువాత 2018లో తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటికొచ్చేసింది. జనసేన కూడా బీజేపీతో స్నేహం వదులుకుని వామపక్షాలతో, తరువాత బీఎస్పీతో జత చేరింది. ఆా తరువాత తిరిగి బీజేపీకు దగ్గరైంది. ఇటీవల రెండేళ్లుగా తెలుగుదేశంతో కలిసి జనసేన ప్రయాణిస్తోంది. ఇటీవలే తెలుగుదేశం-జనసేన పొత్తు ఖరారైంది. ఇప్పుడు తాజాగా బీజేపీతో పొత్తు ఖరారైంది. అయితే ఎవరికెన్ని సీట్లనేది ఇంకా స్పష్టత రాలేదు. 

తెలుగుదేశం-జనసేన పొత్తు ఖాయమైనప్పుడు జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. ఇవాళ బీజేపీతో పొత్తు ఖరారైన తరువాత బీజేపీకు 6 పార్లమెంట్, జనసేనకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించవచ్చని తెలుస్తోంది. అంటే జనసేనకు ఇప్పటికే కేటాయించిన 3 స్థానాల్నించి ఒకటి తగ్గిపోనుంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే జనసేనకు 24 స్థానాలుగా ప్రకటించిన పరిస్థితి తెలిసిందే. కానీ ఇవాళ ఢిల్లీలో జరిగిన భేటీలో బీజేపీ-జనసేనకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలిస్తున్నట్టు తేలింది. అంటే బీజేపీ 6 స్థానాలతో సరిపెట్టుకుంటుందా లేక జనసేన మరి కొన్ని స్థానాల్ని వదులుకుంటుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 

Also read: Pawan Kalyan: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఫిక్స్.. అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న పవన్..?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News