Janasena: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే..తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా రంగంలో ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ, తెలుగుదేశం, వైసీపీలు అభ్యర్ధుల్ని ప్రకటించగా జనసేన రెండు స్థానాల్ని పెండింగులో పెట్టింది.
ఏపీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో బరిలో నిలుస్తోంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు తప్పించి మిగిలిన అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు జనసేన అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. కాకినాడ లోక్‌సభ నుంచి ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉంటే, మచిలీపట్నం నుంచి బాలశౌరిని ఇవాళ ఖరారు చేసింది. అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకు కేటాయించడమే కాకుండా అక్కడినించి సుజనా చౌదరి బరిలో నిలుస్తున్నారు. ఇక విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ ఇప్పటికే అభ్యర్ధుల్ని ప్రకటించింది.
దాంతో కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా భావించే కాపు సామాజికవర్గం నేత వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల ఆయన జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపారు. దాంతో జనసేనలో చేరి మచిలీపట్నం నుంచి పోటీ చేయవచ్చని భావించారు. కానీ జనసేన మచిలీపట్నం స్థానాని బాలశౌరికి ఖరారు చేసింది. దాంతో వంగవీటి రాధాకృష్ణకు ఈసారి ఏ పార్టీలోనూ ఎక్కడా అవకాశం లేకుండా పోయింది.
ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్ని శాసించిన వంగవీటి రంగా వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో రాణించలేక తప్పుటడుగులతో చతికిలపడిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ్నించి , ఏ పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం లేదు. ఈ క్రమంలో వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
Also read: AP DSC 2024 Postponed: ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా, తిరిగి ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook