శుభవార్త: కరోనా కేసుల కన్నా డిశ్ఛార్జ్‌లే ఎక్కువ!

AP CoronaVirus Cases | తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 8, 2020, 03:55 PM IST
శుభవార్త: కరోనా కేసుల కన్నా డిశ్ఛార్జ్‌లే ఎక్కువ!

AP Corona Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,062 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 1051 మందికి కరోనా సోకగా, మిగతా 11 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP COVID19 Cases) 22,259కు చేరుకున్నాయి.  షాకింగ్: 92శాతం కోవిడ్19 బెడ్స్ ఖాళీనే

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 11,101 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 10,894 కోవిడ్19 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 12 కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 264కి చేరింది. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్

తాజాగా కర్నూలు జిల్లాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరులో ఒక్కరు, గుటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి మరణించారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,643 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 1,062 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 1,332 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  టీమిండియాకు దూకుడు నేర్పిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ

నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 10,50,090 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 18,520 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,257 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 420 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 7న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News