CM Jagan Comments: వారు రాష్ట్ర ద్రోహులా..దేశ ద్రోహులా..? సీఎం జగన్ ఆగ్రహం..!

CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న వీరిని రాష్ట్ర ద్రోహులు అని అనాలా లేక దేశ ద్రోహులని అనాలా అని ప్రశ్నించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 01:39 PM IST
  • ఏపీలో పొలిటికల్ హీట్
  • ప్రతిపక్షాలపై సీఎం జగన్ మండిపాటు
  • కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
CM Jagan Comments: వారు రాష్ట్ర ద్రోహులా..దేశ ద్రోహులా..? సీఎం జగన్ ఆగ్రహం..!

CM Jagan Comments: ఆంధ్రప్రదేశ్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న వీరిని రాష్ట్ర ద్రోహులు అని అనాలా లేక దేశ ద్రోహులని అనాలా అని ప్రశ్నించారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం జగన్..వైఎస్ఆర్ మత్స్యకార భరోసాను ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. 

ఈసందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుడు ఎవరైనా ప్రజలను నమ్ముకుంటారని కానీ చంద్రబాబు.. కొడుకుని, దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నారని మండిపడ్డారు. పిల్లలు బాగా చదువుకోవాలని అందరూ కోరుకుంటారని ..ఐతే చంద్రబాబు ఇంగ్లీష్‌ మీడియం చదువులను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. 

కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా..బ్యాంకు అప్పులిచ్చినా వారికి బాధేనన్నారు. రాష్ట్రానికి మంచి జరగకుండా రాబంధుల్లా అడ్డుకుంటున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్లు లీక్‌ చేయించి..రాజకీయాలు చేస్తున్నారన్నారు సీఎం జగన్. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి వారిని ఏమని అనాలో ప్రజలే నిర్ణయించాలన్నారు. 

తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మేము ఈ పని చేశామని చంద్రబాబు చెప్పుకునే ధైర్యం ఉందా అని సీఎం జగన్(CM JAGAN) సవాల్ విసిరారు. చంద్రబాబు(CHANDRA BABU), పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా విమర్శలు సంధించారు. ఇటు సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. మరోసారి సీఎం జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు.

Also read:One Family One Ticket: ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చింతన్‌ శిబిర్‌ లో చర్చ, క్లారిటీ వచ్చే అవకాశం

Also read:Weight Loss in 15 Days: కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలంటే ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News