Anantapur robbery : అనంతపురం జిల్లా కదిరిలో దొంగల బీభత్సం.. ఉపాధ్యాయురాలి హత్య

robbers killed government teacher in Anantapur district kadiri: మంగళవారం ఉదయం శివశంకర్‌రెడ్డి (Sivashankar Reddy) వాకింగ్ కు వెళ్లారు. అదును చూసి ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఉషారాణిపై దాడి చేసి చంపేశారు. తర్వాత ఆమె మెడలోని బంగారాన్ని (Gold) లాక్కెళ్లారు. అంతకుముందు ఉషారాణి ఇంటి పక్కన కూడా ఈ దొంగలు దొంగతనం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 11:56 AM IST
  • అనంతపురం జిల్లా కదిరిలో దొంగల బీభత్సం
  • కదిరికి చెందిన గవర్నమెంట్ టీచర్ ఉషారాణి హత్య
  • ఆ పక్కింటిలో ఉండే శివమ్మ అనే మహిళకు కూడా తీవ్ర గాయాలు
  • బంగారం కోసం దారుణానికి పాల్పడ్డ దొంగలు
 Anantapur robbery : అనంతపురం జిల్లా కదిరిలో దొంగల బీభత్సం.. ఉపాధ్యాయురాలి హత్య

Anantapur robbery robbers killed government teacher and robbery in two houses at Anantapur district kadiri: అనంతపురం జిల్లా కదిరిలో దొంగలు బీభత్సం చాలా దారుణంగా ఉంది. కదిరిలో ఉండే గవర్నమెంట్ టీచర్ (Government Teacher) ఉషారాణి (45) ఇంట్లో దొంగతనానికి వెళ్లిన కొందరు దొంగలు ఆమెను దారుణంగా హతమార్చారు. అంతకుముందు ఆ పక్కింటిలోనూ దొంగతనం చేసే క్రమంలో ఆ ఇంట్లో ఉన్న శివమ్మ (Shivamma) అనే మహిళను కూడా తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. శివమ్మ ఇంటి పనిమనిషి ఉదయం వచ్చి చూసే వరకు ఈ విషయం బయటకు రాలేదు. 

Also Read : Mangalavaram sentiments in Telugu: మంగళవారం చేయకూడని పనులు ఇవేనా ? చేస్తే ఏమవుతుంది ?

కదిరికి చెందిన శివశంకర్‌రెడ్డి, ఉషారాణి (Usharani) భార్యాభర్తలు. వాళ్లిద్దరూ గవర్నమెంట్ టీచర్స్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం శివశంకర్‌రెడ్డి (Sivashankar Reddy) వాకింగ్ కు వెళ్లారు. అదును చూసి ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఉషారాణిపై దాడి చేసి చంపేశారు. తర్వాత ఆమె మెడలోని బంగారాన్ని (Gold) లాక్కెళ్లారు. అంతకుముందు ఉషారాణి ఇంటి పక్కన కూడా ఈ దొంగలు దొంగతనం చేశారు. ఆ ఇంట్లో ఉండే శివమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపరిచి, ఆమె మెడలోని బంగారాన్ని దోచుకెళ్లారు.

Also Read : Warner On Williamson: సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా విలియమ్సన్.. వార్నర్ హింట్

మొదట శివమ్మ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు (Thieves) ఆమె కుమారుడు, కోడలు ఉండే గదికి తాళం వేశారు. తర్వాత శివమ్మపై దాడి చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఆసుపత్రికి (Bangalore Hospital) తరలించారు.

Also Read : T20 World Cup 2022 Host: 2022లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్న వేదికలివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News