AP News: చంద్రబాబుకు అమిత్​షా ఫోన్‌.. ఏపీలోని పరిణామాలపై చర్చ..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 04:42 PM IST
  • చంద్రబాబుకు అమిత్​షా ఫోన్
  • రాష్ట్ర పరిణామాలపై చర్చ
  • ఏపీలోప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందన్న బాబు
AP News: చంద్రబాబుకు అమిత్​షా ఫోన్‌.. ఏపీలోని పరిణామాలపై చర్చ..!

AP News: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఫోన్‌(Amit Shah phone call to chandrababu)లో మాట్లాడారు. ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై అమిత్‌ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలను చంద్రబాబు అమిత్‌షా(Amit Shah)కు వివరించినట్లు సమాచారం. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తెదేపా నేతలు పోరాడుతుంటే వైకాపా దాడులకు తెగపడటంతో పాటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Also read:AP High Court: మహిళలకు అధికారమిస్తే తప్పేంటి, ఆందోళన ఎందుకు

ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా కార్యాలయాల(TDP Offices)పై జరిగిన దాడి వివరాలు, ఇతరత్రా అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు ఇటీవల దిల్లీ పర్యటన(chandrababu delhi tour news)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా చంద్రబాబు.. అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరారు. అదే సమయంలో కశ్మీర్‌ పర్యటన, వరుస కార్యక్రమాల కారణంగా అమిత్‌ షా సమయం ఇవ్వలేకపోయారు. కశ్మీర్‌ పర్యటన నుంచి తిరిగొచ్చిన అమిత్‌ షా ఇవాళ చంద్రబాబు(Chandrababu)కు ఫోన్‌ చేసి మాట్లాడారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News