CM Jagan: పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి సీతారామ రాజు అని సీఎం జగన్ అన్నారు. అల్లూరి జయంతి సందర్బంగా ఈవేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలుగు జాతి, భారతదేశానికి అల్లూరి ఓ స్ఫూర్తి అని..అందుకే ఆయన పేరుపైనే జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషని గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందన్నారు. భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎంతో మంది త్యాగాలు చేస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు సీఎం జగన్. అల్లూరి లాంటి వ్యక్తి తెలుగు గడ్డపై పుట్టడం గర్వ కారణమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వర్చువల్‌గా జరిగిన ఈకార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నేతలు నివాళులర్పిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
Also read:Roja Selfie with Modi: ప్రధాని మోడీ సభలో మంత్రి రోజా హల్చల్.. ఏం చేసిందో తెలుసా?
Also read:PM Modi: యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు ఆదర్శం..కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook