Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిని రద్దు చేయాలంటూ అభ్యర్థులు భారీ స్థాయిలో ఆందోళన చేపడుతున్నారు. తాజాగా అగ్నిపథ్ మంటలు తెలుగు రాష్ట్రాలకు తాకాయి. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు హింస్మాకాండకు దిగారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిరసన తెలిపారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈక్రమంలోనే రైళ్లపై రాళ్ల దాడి చేసి..నిప్పు పెట్టారు. సికింద్రాబాద్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్లాంట్ ఫామ్‌పై ఫర్నీచర్ సైతం ధ్వంసం చేశారు. ఒక్కసారిగా స్టేషన్‌లోకి అభ్యర్థులు చొచ్చుకురావడంతో గందరగోళం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఐనా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసుల కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
#WATCH | Telangana: Secunderabad railway station vandalised and a train set ablaze by agitators who are protesting against #AgnipathRecruitmentScheme. pic.twitter.com/2llzyfT4XG
— ANI (@ANI) June 17, 2022
అగ్నిపథ్ ఆందోళనలతో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లల్లో భద్రతను రెట్టింపు చేశారు. ఆర్పీఎఫ్,జీఆర్పీ నుంచి అదనపు బలగాలను మోహరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే పలు మార్గాలను మూసివేశారు. కాచిగూడ, విజయవాడ, వరంగల్, తిరుపతి, కడప, విశాఖ తదితర రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలను చేరుకున్నాయి.
#WATCH | Telangana: Stalls vandalised, train set ablaze and its windows broken at Secunderabad railway station by agitators who are protesting against #AgnipathRecruitmentScheme pic.twitter.com/zFNgJ2MEgD
— ANI (@ANI) June 17, 2022
అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఆందోళన మిన్నంటాయి. బల్లియాలో పరిస్థితి చేయి దాటిపోయింది. రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి ఆగిన రైళ్లకు కొందరు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో రైలు దగ్ధమైంది. రైల్వే స్టేషన్‌లో ఫర్నీచర్, హోటళ్లు దెబ్బతిన్నాయి. ఐతే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పోలీసులు..ఆందోళనకారులను చెదరగొట్టారు.
బీహార్‌లోని మొహియుద్దీనగర్ స్టేషన్‌లోనూ కొందరు యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలకు నిప్పుపెట్టారు. లఖ్‌మినియా రైల్వే స్టేషన్‌లోనూ ఆందోళనలు కొనసాగాయి. దీంతో రౌళ్ల రాకపోలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను రెట్టింపు చేశారు.
Also read: Sai Pallavi: మరో వివాదంలో సినీ నటి సాయి పల్లవి..పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ..!
Also read: Corona Updates in India: భారత్‌లో ఫోర్త్ వేవ్ బెల్స్..పెరుగుతున్న రోజువారి కేసులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు..చేయి దాటిపోతున్న పరిస్థితి..!
దేశంలో అగ్నిపథ్ మంటలు
పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్
సికింద్రాబాద్‌లో హింస్మాకాండ