Achyuthapuram SEZ Gas Leakage: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ (SEZ)లోని బ్రాండిక్స్ సీడ్స్ దుస్తుల పరిశ్రమలో మరోసారి గ్యాస్ లీకేజీ చోటు చేసుకుంది. పరిశ్రమలో విష వాయువు లీకవడంతో దాదాపు 100 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారు అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో 2 నెలల కాలంలో ఇది రెండో గ్యాస్ లీకేజీ ఘటన కావడం గమనార్హం.
ఫ్యాక్టరీలో మంగళవారం (ఆగస్టు 2) బీ షిఫ్ట్ సమయంలో సాయంత్రం 6.15 గం.-7గం. ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో దాదాపు 200 మంది మహిళలు విధుల్లో ఉన్నట్లు సమాచారం. వీరిలో 100 మంది మహిళలు వాంతులు, వికారంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని తెలుస్తోంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళలు తేరుకునేందుకు మరికొద్ది గంటలు పట్టే అవకాశం ఉంది.
గ్యాస్ లీకేజీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా అస్వస్థతకు గురైన మహిళల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న తమవారిని చూసి ఆవేదన చెందుతున్నారు. గతంలో గ్యాస్ లీకేజీ జరిగినప్పుడే కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడీ ఈ ఘటన జరిగి ఉండకపోయేదని అభిప్రాయపడుతున్నారు. స్థానిక జనసేన నేత ఒకరు ఈ ఘటనపై మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. రెండు నెలల క్రితం ఇదే ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటన జరిగితే ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని.. కానీ కమిటీ రిపోర్ట్‌ను మాత్రం బయటపెట్టలేదని మండిపడ్డారు.
ఇదే బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది మే నెలలోనూ గ్యాస్ లీకేజీ జరిగింది. ఆ సమయంలో చాలామంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం ఒక కమిటీతో విచారణ జరిపించింది. అయితే లీకేజీ కారణాలకు సంబంధించిన రిపోర్ట్‌ను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు, స్థానికులు మండిపడుతున్నారు. ఇక తాజా ప్రమాద ఘటనకు సంబంధించి కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు.
Andhra Pradesh | 53 people admitted in government hospital, 41 people being treated in various other hospitals in the district; total 94 persons currently under treatment after the gas leak incident: Visakhapatnam district officials
— ANI (@ANI) August 3, 2022
Also Read: Reliance Jio: రిలయన్స్ జియో కస్టమర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రీఛార్జ్ ప్లాన్‌పై రూ.150 తగ్గింపు
Also Read: Horoscope Today August 3rd: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఇవాళ ఊహించని స్థాయిలో ధనలాభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకేజ్.. 100 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత..
అచ్యుతాపురం సెజ్‌లో గ్యాస్ లీకేజీ
బ్రాండిక్స్ ఫ్యాక్టరీలో లీకైన గ్యాస్
దాదాపు 100 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత