Chandrababu: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ఆవును తప్పించబోయి

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతోనే చంద్రబాబుకు ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.

Last Updated : Sep 5, 2020, 07:01 PM IST
Chandrababu: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ఆవును తప్పించబోయి

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రతిపక్ష నేత ( Ap opposition leader ) చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ( Bullet proof vehicle ) కావడంతోనే చంద్రబాబుకు ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.

ఏపీ ప్రతిపక్ష నేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Ex Cm chandra babu naidu ) కు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ చంద్రబాబు కాన్వాయ్ ప్రమాదానికి ( Convoy Accident ) గురైంది. ఎదురుగా రోడ్డుపై ఉన్న ఓ ఆవును తప్పించబోయి  డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. సడెన్ బ్రేక్ కారణంగా కాన్వాయ్ లో ముందున్న ఎస్కార్ట్  వాహనాన్ని చంద్రబాబు వాహనం బలంగా ఢీ కొంది. అయితే చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. క్షేమంగా బయటపడ్డారు. సిబ్బందికి మాత్రం స్వల్ప గాయాలవడంతో మరో వాహనంలో వారిని తరలించారు. అమరావతి నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్తుండగా..ఈ ప్రమాదం జరిగింది. Also read: AP: ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీకు అగ్రస్థానం

Trending News