AP CM Ys Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హత్య చేస్తానంటూ హెచ్చరిక, నిందితుడి అరెస్టు

AP CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చంపేస్తానంటూ హెచ్చరికలు చేసిన నిందితుడు అరెస్టయ్యాడు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అతడిని అరెస్టు చేసింది. వివరాలిలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2022, 09:42 AM IST
AP CM Ys Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హత్య చేస్తానంటూ హెచ్చరిక, నిందితుడి అరెస్టు

AP CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చంపేస్తానంటూ హెచ్చరికలు చేసిన నిందితుడు అరెస్టయ్యాడు. సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం అతడిని అరెస్టు చేసింది. వివరాలిలా ఉన్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మానవబాంబుగా మారి అంతం చేస్తానంటూ రాజమండ్రికి చెందిన ఓ పవన్ ఫణి అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టింగ్ చేశాడు. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సేల్స్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ఈ నిందితుడు జనసేన మద్దతుదారుడని తెలిసింది. కన్నాభాయ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఈ అభ్యంతరకర పోస్టింగులు చేశాడు. జనవరి 16వ తేదీన ఈ పోస్టింగ్ చేశాడు. అదే రోజు రాత్రి తొలగించాడు. ట్విట్టర్ హ్యాండిల్ ఎక్కౌంట్ డిలీట్ చేసి..ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి..ఉద్యోగానికి సెలవు పెట్టేశాడు. సీఐజీ సైబర్ నేరాల విభాగం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడి ఆచూకీని కనిపెట్టడంతో ఆ నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను (Ap cm ys jagan)హతమారిస్తే..ప్రభుత్వం కూలిపోతుందంటూ విద్వేషపూరిత పోస్టులు పెట్టినట్టు ఆ నిందితుడు స్వయంగా వాంగ్మూలమిచ్చాడు.

అభ్యంతరకర, అశ్లీల, శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా చట్ట వ్యతిరేక పోస్టులు పెడితే సహించేది లేదని సీఐడీ (CID)హెచ్చరించింది. తప్పుడు ఖాతాలతో పోస్టింగులు పెట్టి ఆ తరువాత డిలీట్ చేసినా నిందితులు తప్పించుకోలేరని సీఐడీ హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించింది. మరోవైపు జనసేన మీడియా విభాగం ఈ ఘటనపై స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగులు చేసేవారిని తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని తెలిపింది. ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తితో తమ పార్టీకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హింస, అశాంతిని రేకెత్తించే వ్యాఖ్యల్ని ఆ పార్టీ ఖండించింది. 

Also read: Indigo Airlines: కర్నూలు నుంచి విజయవాడకు కొత్తగా విమాన సర్వీసు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News