Girl Trying To Kill Her Father in Vizag: ఆ బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఐటీఐ చదివే బాలుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించాడు బాలుడు. డబ్బు, నగలు తీసుకురావాలని చెప్పాడు. దీంతో ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారం తీసుకెళ్లి బాలుడికి ఇచ్చింది. ఇంట్లో డబ్బు, బంగారు ఆభరణాలు మాయం అవడంపై కుమార్తెతో తండ్రి గొడవపడుతున్నాడు. చివరకు ప్రియుడి మాటలు నమ్మి కన్నతండ్రినే హత్య చేసేందుకు యత్నించింది ఆ బాలిక. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు ఇలా..
విశాఖ నగరంలో అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కుమారుడు, కుమార్తె (17) ఉన్నారు. కుమార్తెను ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివిస్తున్నాడు. ఆమెకు విశాఖ నగరంలోనే ఐటీఐ చదువుతున్న బాలుడు (17)తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. బాలికను పెళ్లి చేసుకుంటానని బాలుడు నమ్మించడంతో.. ఇంట్లోని రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి అతడికి ఇచ్చింది.
ఇంట్లో నగదు, నగలు మాయంకావడంతో విషయం తండ్రికి తెలిసింది. దీంతో బాలికను నిలదీశాడు. ఈ విషయంపై కొన్ని నెలలుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో బాలిక తన ప్రియుడికి విషయం మొత్తం చెప్పేసింది. అయితే తన దగ్గర డబ్బులు లేవని.. నువ్వే ఏదో ఒకటి చేయాలని బాలికను కోరాడు ప్రియుడు.
దీంతో శుక్రవారం రాత్రి తండ్రి నిద్రిస్తుండగా.. వంట గదిలోకి వెళ్లి కత్తి తెచ్చుకుంది బాలిక. కత్తితో తండ్రి మెడపై పొడిచేందుకు యత్నించింది. అయితే శబ్ధం రావడంతో తండ్రి పక్కకు జరగ్గా.. కత్తి వీపునకు తగిలి గాయమైంది. శనివారం విశాఖ నగరంలోని నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించగా ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతని ప్రోద్బలంతోనే డబ్బులు కాజేశారని బాలిక బంధువులు చెబుతున్నారు. తనను మోసం చేశాడని ప్రియుడిపై కూడా బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బాలికను జువైనల్ హోమ్‌కు తరలించారు.
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం.. సంక్రాంతికి బస్సులకు మంచి ఆదరణ
Also Read: Wipro Lays Off: విప్రో ఉద్యోగులకు ఝలక్.. 400 మందికి ఉద్వాసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook