AP Corona update: ఏపీలో పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 1,257మందికి పాజిటివ్!

AP Corona cases: ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,257మంది కరోనా పాజిటివ్ గా తేలింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 06:01 PM IST
  • ఏపీలో పెరిగిన కరోనా కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్​తో ఇద్దరు మృతి
  • అత్యధికంగా చిత్తూరులో కేసులు నమోదు
AP Corona update: ఏపీలో పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 1,257మందికి పాజిటివ్!

AP Corona cases: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 38,479 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1,257మంది కరోనా పాజిటివ్ గా (Corona Cases in AP) నిర్ధారణ అయింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,774కు (Active Cases in AP) చేరింది. వైరస్ బారిన పడి.. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా నుంచి 140 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 254 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖలో 196, అనంతపురంలో 138, కృష్ణాలో 117, గుంటూరులో 104, నెల్లూరులో 103 కేసులు వెలుగుచూశాయి. 

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. గతకొన్ని రోజులుగా కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ (Third Wave in India) ఆందోళనలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,59,632 మంది వైరస్ (Corona Cases in India) బారిన పడ్డారు. వైరస్ ధాటికి 327 మంది మృతి చెందారు. 40,863 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగింది.

Also Read: Ap Government: ఏపీలో నైట్‌ కర్ఫ్యూపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ 27  రాష్ట్రాలకు పాకింది. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623కి (Omicron cases in India) చేరింది. అందులో 1,409 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  అత్యధికంగా మహారాష్ట్ర 1,009 ఒమిక్రాన్​ కేసులతో తొలి స్థానంలో ఉంది. 513 మంది ఒమిక్రాన్​ బాధితులతో దిల్లీ తర్వాత స్థానంలో ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News