రాజధానిని మార్చే అధికారం సీఎం జగన్ కు లేదు: కామినేని శ్రీనివాస్

సచివాలయాన్ని ఎందుకు మార్చుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేయాలని దీనిపై కేంద్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వాకబు చేస్తుందని, రాజధానిని మార్చే అధికారం సీఎం జగన్ కు లేదని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్

Last Updated : Feb 3, 2020, 11:47 PM IST
రాజధానిని మార్చే అధికారం సీఎం జగన్ కు లేదు: కామినేని శ్రీనివాస్

అమరావతి: సచివాలయాన్ని ఎందుకు మార్చుతున్నారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేయాలని దీనిపై కేంద్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వాకబు చేస్తుందని, రాజధానిని మార్చే అధికారం సీఎం జగన్ కు లేదని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కొత్త కంపెనీలు రాష్ట్రానికి రావడం లేదని, ఉన్న కంపెనీలు రాష్ట్రం నుండి వెళ్ళిపోయాయని, రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని అన్నారు. 

ప్రభుత్వం కావాలనుకుంటే ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుపుకోవాలి కానీ, అవినీతి జరిగిందని రాజధానిని మారుస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఎవరు రాజధాని మార్పు కోరుకోవడం లేదని, విశాఖ ప్రజలు కూడా రాజధాని కావాలని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. 

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకచోట నుండే జరగాలని, అమరావతిగా గతంలో అన్నీ పార్టీలు ఏకగ్రీవంగా  ఒప్పుకున్నప్పటికీ, కేవలం ఆరునెలల్లో అన్నీ రద్దులు చేస్తూ  ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. అర్ధరాత్రి కార్యాలయాలు తరలింపు చేస్తున్న ముఖమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయస్థానం ముందు దోషిగా జగన్ నిలబడక తప్పదని ఆయన అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News