Croatia: కనుచూపు మేర ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందాలు. ముగ్ద మనోహర దృశ్యాలు. ఓ వైపు సముద్రం..ఆహ్లాదకర వాతావరణం. బెస్ట్ టూరిజంలా అన్పిస్తుంది కదా. మరి ఈ ప్రాంతంలో ఇళ్లు కొనుగోలు చేస్తారా..అత్యంత చౌక ధరకే సుమా..
ప్రపంచంలో మనకు తెలియని బెస్ట్ టూరిజం ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కనుచూపు మేర ఎటువైపు చూసినా పచ్చని ప్రకృతి అందాలతో..ముగ్ద మనోహర దృశ్యాలతో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఓ వైపు సముద్రముండి..మరోవైపు ఆహ్లాదకర వాతావరణంలో పట్టణముంటే...అటువంటి ప్రాంతాల్ల నివాసముండాలని ఎవరికైనా కోర్కె ఉంటుంది. అయితే అలాంటి ప్రాంతంలో ఉండాలంటే చాలా కాస్ట్ అని ఆలోచిస్తున్నారా..కానేకాదు. అత్యంత చౌక ధరకు..అక్కడ ఏకంగా ఇళ్లు కొనుగోలు చేసుకోవచ్చు మీరు.
క్రొయేషియా (Croatia) దేశం లెగ్రాడ్ పట్టణం. చుట్టూ పచ్చని ప్రకృతికి, ఆహ్లాదకర వాతావరణానికి వేదిక. కారణం తెలియదు గానీ చాలాకాలంగా అక్కడ జనాభా తగ్గిపోతుంది. ఎక్కడ చూసినా ఖాళీ ఇళ్లే దర్శనమిస్తున్నాయి. కాలుష్యానికి, ఉరుకులు పరుగుల బిజీ జీవితానికి దూరంగా ఉండే ప్రాంతమది. అయినా అక్కడ ఇళ్లు ఖాళీ అయిపోతున్నాయయి. జనాభా తగ్గిపోతోంది. అందుకే అక్కడి ప్రభుత్వం జనాభా పెంచేందుకు, లెగ్రాడ్ పట్టణాన్ని (Legrad City) జనావాసంగా చేసేందుకు కొత్త ఆలోచన చేసింది. చాలా చౌకగా అక్కడి ఇళ్లను విక్రయిస్తోంది. ఒక్కో ఇంటిని కేవలం 12 రూపాయలకే (House for 12 Rupees) విక్రయిస్తోంది. ఎవరైనా సరే డబ్బులు చెల్లించి ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. అక్కడ ఇంటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వమే ఇంటి మరమ్మత్తులకు 25 వేల కునాలు చెల్లించనుంది. ఒక కునా అంటే ఇండియన్ రూపీస్‌లో 12 రూపాయలకు సమానం. అయితే కొన్ని షరతులు విధించింది. కనీసం 15 ఏళ్ల పాటు అక్కడే జీవించాలి. 40 ఏళ్ల లోపు అయుండి...ధనవంతులై ఉండాలి. ఈ నిబంధనలకు ఓకే అయితే దర్జాగా అక్కడ ఇళ్లు కొనుగోలు చేసి అక్కడే ఉండవచ్చు. ఇప్పటికే ఈ నిబంధన ప్రకారం అక్కడ 17 ఇళ్లు విక్రయించారు. ఇంకా చాలా ఉన్నాయి. మీకూ కావాలా...త్వరపడండి మరి.
Also read: Izrael: ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా బెన్నెట్, 8 పార్టీల సంకీర్ణ కూటమికి అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook