'కరోనా వైరస్' గబ్బిలాల నుంచే వచ్చిందా..?

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 210 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల 50 వేల మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే లక్షకు పైగా జనం కరోనా వైరస్ దెబ్బతో మృతి చెందారు. 

Last Updated : Apr 12, 2020, 02:05 PM IST
'కరోనా వైరస్' గబ్బిలాల నుంచే వచ్చిందా..?

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 210 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల 50 వేల మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే లక్షకు పైగా జనం కరోనా వైరస్ దెబ్బతో మృతి చెందారు. 

చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ ప్రారంభమైంది. అక్కడి నుంచి అతి కొద్ది కాలంలోనే మహమ్మారిగా మారి ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతోంది. దీంతో అన్ని దేశాలు ఇప్పుడు చైనాపై గుర్రుగా ఉన్నాయి. మరోవైపు చైనాలోని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కరోనా వైరస్ ఎలా వచ్చిందనే దానిపై పరిశోధనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

'కరోనా వైరస్' గబ్బిలాల  ద్వారా మనుషులకు  వ్యాప్తి చెందిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇది నిజంగా గబ్బిలాల నుంచే వచ్చిందా.. ? కాదా .. ? అనే పరిశోధనలు చేపట్టింది చైనాలోని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇందుకోసం వుహాన్ కు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్న యూనాన్ లో ఓ పరిశోధనశాల ఏర్పాటు చేశారు. పరిశోధనలు చేసేందుకు గానూ వారికి 3.7 మిలియన్ల అమెరికా డాలర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రయోగంలో వుహాన్ శాస్త్రవేత్తలు కొంత మేర విజయం సాధించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కు సంబంధించిన జన్యు క్రమాన్ని వారు గబ్బిలాల్లో  గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో కోవిడ్ 19 వైరస్.. మొట్టమొదటిసారిగా మాంసం విక్రయశాల నుంచి మనుషులకు సంక్రమించిందన్నదానికి కొంత మేర  బలం చేకూరినట్లయింది. 

మరోవైపు కరోనా వైరస్ పుట్టుక వెనుక మరిన్ని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన కొందరు పరిశోధకులు రక్తం స్ప్రే చేస్తుండగా .. ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని .. వారి నుంచి స్థానికులకు వైరస్ వ్యాప్తి చెందిందనే కథనం వినిపిస్తోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News