WHO: రెండు సంవత్సరాల్లో కరోనా అంతం

యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ ( Coronavirus ) ముప్పుతిప్పలు పెడుతోంది. 2019 చివరి వరకు ప్రపంచం వేరేలా ఉంది. నేటి ప్రపంచం వేరేలా ఉంది.  

Last Updated : Aug 22, 2020, 01:52 PM IST
    • యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ ( Coronavirus ) ముప్పుతిప్పలు పెడుతోంది. 2019 చివరి వరకు ప్రపంచం వేరేలా ఉంది. నేటి ప్రపంచం వేరేలా ఉంది.
    • ఏదో హార్రర్ ఫిల్మ్ చూస్తున్నట్టు.. అంతకన్నా దారుణంగా ఉంది జీవితం.
    • కంటికి కూడా కనిపించని కోవిడ్-19 మొత్తం భూమిపై ఉన్న ప్రజలను వణికిస్తోంది.
    • దీనిపై పోరాటం చేయడానికి ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు కూడా తలపట్టుకుంటున్నాయి.
WHO: రెండు సంవత్సరాల్లో కరోనా అంతం

యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ ( Coronavirus ) ముప్పుతిప్పలు పెడుతోంది. 2019 చివరి వరకు ప్రపంచం వేరేలా ఉంది. నేటి ప్రపంచం వేరేలా ఉంది. ఏదో హార్రర్ ఫిల్మ్ చూస్తున్నట్టు.. అంతకన్నా దారుణంగా ఉంది జీవితం. కంటికి కూడా కనిపించని కోవిడ్-19 మొత్తం భూమిపై ఉన్న ప్రజలను వణికిస్తోంది. దీనిపై పోరాటం చేయడానికి ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు కూడా తలపట్టుకుంటున్నాయి.

గుహలో ఎంత చీకటి ఉన్నా..దాని గుమ్మం దగ్గర మాత్రం వెలుగు ఉంటుంది అంటారు. అయితే కరోనాగుహలో చిక్కుకున్న ప్రపంచ జనాబా గుమ్మం దగ్గరికి వెళ్లి మళ్లీ ఎప్పుడు వెలుగును చూస్తుంది? ..ఎప్పుడు ఈ మహమ్మారి అంతం అవుతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న..ఈ ప్రశ్నకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాధానం చెబుతోంది. 

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) జనరల్ డైరక్టర్ టెడ్రోస్ అథనోమ్ ( Tedros Adhanom Ghebreyesus ) కరోనావైరస్ ఎప్పటిలోపు అంతం అవుతుందో చెప్పారు. రెండేళ్లలో కరోనాను కట్టిచేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ మహమ్మారి వల్ల మనకు ఆరోగ్యం, ఆర్థిక విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది అని ఆయన ఉటంకించారు.

కోవిడ్-19( Covid-19 )  సంక్రమణను నిరోధించడానికి ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ను ప్రకటించడాన్ని ఆయన ప్రశంసించారు. అయితే లాక్ డౌన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు అని కూడా ఆయన తెలిపారు.

ప్రతీ దేశం, ప్రతీ పౌరుడు, ప్రతీ సంస్థ, ప్రతీ సమాజం తమ స్వీయక్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు టెడ్రోస్. కోవిడ్-19 వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రస్తుతం పరిశోధనలు వేగం పుంజుకున్నాయి అని రానున్న రెండు సంవత్సరాల్లో కరోనావైరస్ కథ ముగిసిపోతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి

Trending News