స్కూల్స్ తెరవకపోతే..ఆ ప్రమాదం పొంచి ఉందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO On Schools: కరోనా మహమ్మారి నేపధ్యంలో స్కూల్స్ మూతపడ్డాయి. వరుసగా రెండో ఏడాది విద్యారంగంపై పెను ప్రభావం పడింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేస్తోంది. పిల్లల చదువు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 12, 2021, 01:43 PM IST
స్కూల్స్ తెరవకపోతే..ఆ ప్రమాదం పొంచి ఉందంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO On Schools: కరోనా మహమ్మారి నేపధ్యంలో స్కూల్స్ మూతపడ్డాయి. వరుసగా రెండో ఏడాది విద్యారంగంపై పెను ప్రభావం పడింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేస్తోంది. పిల్లల చదువు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ (Corona Virus)సంక్రమణ కారణంగా సుదీర్ఘకాలంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. వరుసగా రెండవ విద్యాసంవత్సరంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపధ్యంలో స్కూల్స్ తిరిగి తెరిచే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్(Dr Soumya Swaminathan) కీలక సూచనలు చేశారు. ప్రపంచ దేశాలన్నీ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. పిల్లల్ని ఎక్కువకాలం నాలుగ్గోడల మధ్య ఉంచితే మానసిక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. సాధ్యమైనంతలో కోవిడ్ 19 నిబంధనలన్నీ పాటిస్తూ పాఠశాలల్ని తిరిగి ప్రారంభించడమే మంచిదన్నారు. ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇండోర్ సమావేశాలకు దూరంగా ఉండాలని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. కోవిడ్ 19 కారణంగా ఇండియాలో కోట్లాదిమంది పిల్లలు స్కూల్ మానేశారని..ఫలితంగా చదువు ఎక్కువగా దెబ్బన్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా మరో ఆరు నెలల సమయం అందరూ ఓపిగ్గా ఉండి కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్(Corona Vaccination) కార్యక్రమం ఊపందుకుంటే పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థికి చేరుతాయని చెప్పారు. ఇప్పటి వరకూ ఓపిక పట్టినట్టే మరి కొంతకాలం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 

Also read: రక్తమోడుతున్న ఆప్ఘన్ నేల, తాలిబన్ల వశమవుతున్న దేశ భూభాగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News