Imran Khan: 'దేశాన్ని నడిపించేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు': ఇమ్రాన్ ఖాన్​

Pak PM Imran Khan: పాకిస్థాన్ ఆర్థిక స్థితిపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడిపించేంత డబ్బు తమ వద్ద లేదని చెప్పారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 06:51 AM IST
  • పాక్​ ఆర్థిక స్థితిపై ఇమ్రాన్ ఖాన్ ఆందోళన
  • దేశాన్ని నడిపించేంత డబ్బు లేదని వెల్లడి
  • గత ప్రభుత్వాలవల్లే ఈ పరిస్థితని విమర్శ
Imran Khan: 'దేశాన్ని నడిపించేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు': ఇమ్రాన్ ఖాన్​

Pak PM Imran Khan admitted that the government does not have money to run the country: దాయాది దేశం పాకిస్థాన్​ ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతోంది. వీలు దొరికినప్పుడల్లా.. భారత్​పై విష ప్రచారం చేసేందుకు ముందుండే పాకిస్థాన్​.. సొంత దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడంలో మాత్రం విఫలమైంది.

ఆర్థిక స్తోమతపై ఆ దేశ ప్రధాని స్వయంగా ప్రకటన చేశారు. 'ప్రభుత్వాన్ని నడిపించేంత డబ్బు మా వద్ద లేదు' అని (Pak PM Imran Khan on country Economy) చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి అప్పులు చేయాల్సి వస్తోందని కూడా వెల్లడించారు ఇమ్రాన్​ ఖాన్​.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ రెవెన్యూ (ఎఫ్​బీఆర్​), ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ (టీటీఎస్​) ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ ఈ విషయాలను ప్రస్తావించారు.

Also read: టిక్​టాక్​పై నిషేధం ఎత్తవేసిన పాకిస్థాన్- ఇది నాలుగోసారి

Also read: Data Breach Exposed: సైబర్ హ్యాక్‌కి గురైన 'గో డాడీ'.. 1.2మిలియన్ల కస్టమర్ల డేటా చోరీ

ఇమ్రాన్​ ఇంకా ఏం చెప్పారంటే..

వనరుల కొరతతో ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసే మొత్తం తక్కువేనని తెలిపారు ఇమ్రాన్​ ఖాన్​. పెరుగుతున్న విదేశీ అప్పులు, పన్ను రాబడి తక్కువగా ఉండటం వంటివి 'జాతీయ భద్రత' సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు.

పూర్వం ప్రజలు తమ డబ్బును పన్నులు చెల్లించేందుకు ఇష్టపడే వారు కాదని.. ఇప్పటికే చాలా మంది అదే సంస్కృతి కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు (Pak crisis) ఇమ్రాన్ ఖాన్​. స్థానికంగా వనరులను సమకూర్చుకోవడంలో విఫలమవడం వల్లే.. గత ప్రభుత్వాలు విపరీతంగా అప్పులు చేయాల్సి వచ్చిందన్నారు.

నాలుగు నెలల్లో రూ.28 వేల కోట్ల అప్పు..!

నిధుల కొరత వల్ల గడిచిన నాలుగు నెలల్లోనే 3.8 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.28 వేల కోట్ల పైమాటే) అప్పు చేయాల్సి వచ్చిందని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

గత ఏడాది ఇదే సమయంతో తీసుకున్న అప్పులతో పోలిస్తే.. ఈ మొత్తం 18 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఆ దేశ ఆర్థిక శాఖ గణాంకాలు (Pak Debt rise) వెల్లడిస్తున్నాయి.
2009 నుంచి 2018 వరకు ప్రభుత్వాలు భారీగా విదేశాల నుంచి అప్పులు తీసుకున్నాయని.. వాటిని చెల్లిస్తేనే పాకిస్థాన్ అప్పుల ఊభి నుంచి బయట పడగలదని అభిప్రాయపడ్డపారు.

Also read: గడ్డకట్టిన మహా సముద్రం, ఇరుక్కుపోయిన 18 గూడ్స్ ఓడలు, ఎక్కడంటే

దేశంలో పన్నులు చెల్లింపు దారులు 30 లక్షలే..

పాకిస్థాన్​లో 22 కోట్ల జనాభా ఉన్నారు. అందులో పన్నులు చెల్లించే వారు 30 లక్షలు మాత్రమేనని ఆ దేశ ఆర్థిక సలహాదారు షాకత్​ తారిన్​ తెలిపారు. అయితే ఇంకా 15 లక్షల మంది పన్నులు చెల్లించే స్తోమత ఉన్నవారిని గుర్తించినట్లు వెల్లడించారు. వారికి నోటీసులు కూడా పంపినట్లు చెప్పారు.

గతంలోనూ పాక్ బయటపడ్డా పాక్​ దుస్తితి..

గతంలోనూ పాకిస్థాన్​ ప్రభుత్వం ఖర్చుల కోసం.. ఆస్తులను అమ్ముకున్న దాఖాలాలు ఉననాయి. ఇమ్రాన్​ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో.. 31 విలాసవంతమైన ఖార్లను అమ్మి రూ.20 కోట్లను గడించింది. దీనితో పాటు ప్రభుత్వం పోషిస్తున్న గేదెలను కూడా విక్రయించింది ప్రభుత్వం.

సాక్ష్యాత్తు ప్రధాన మంత్ర అధికారిక భవాన్ని విందు, వినోద కార్యక్రమాలకు అద్దెకిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Also read: పాకిస్తాన్ మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో లీక్... సోషల్ మీడియాలో వైరల్... పోలీసులకు ఫిర్యాదు

Also read: హిందూ బాలుడి పై పాకిస్తాన్ లో అత్యాచారం.. ఆపై కిరాతకంగా హత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News