Vladimir Putin: అణు యుద్ధానికి మేము సిద్ధం.. రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన

Russia Ukraine War Update: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా బలగాలు మద్దతుగా నిలిస్తే.. అణు యుద్ధానికి సిద్దమవుతామని ప్రకటించారు. రష్యాలో ఎన్నికలకు ముందు ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 13, 2024, 07:22 PM IST
Vladimir Putin: అణు యుద్ధానికి మేము సిద్ధం.. రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన

Russia Ukraine War Update: అణు యుద్ధానికి మాస్కో సాంకేతికంగా సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన పశ్చిమ దేశాలకు హెచ్చరిక పంపించారు. యూఎస్ తమ దళాలను ఉక్రెయిన్‌కు  పంపిస్తే.. అణు యుద్ధానికి వెనుకాడమని వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 17వ వరకు రష్యాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుతిన్ ఈ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఆయన గెలవడం ఖాయం కావడంతో మరో ఆరేళ్లు అధికారంలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పటి నుంచి అణ్వాయుధాలను ఉపయోగించేందుకు తన సంసిద్ధత గురించి పుతిన్ చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి మాట్లాడుతూ.. రష్యా భూభాగంలో లేదా ఉక్రెయిన్‌లో అమెరికా దళాలను మోహరిస్తే అణు యుద్ధానిని సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతిదీ అణు యుద్ధం వైపు వెళుతుందని తాను అనుకోవట్లేదని.. కానీ తాము దీనికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Also Read: Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియో అప్పుడు లక్షన్నర.. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా?

మరోవైపు రష్యాలోని మూడు చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను చేపట్టింది. కైవ్ తన సరిహద్దు దాడులను తీవ్రతరం చేస్తున్నందున.. ఉక్రేనియన్ రక్షణ దళం దాడులను తీవ్రతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యన్ ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గించడానికి బాగా ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. మూడు రష్యన్ చమురు శుద్ధి కర్మాగారాలు మాస్కోకు ఆగ్నేయంగా 130 మైళ్ల దూరంలో ఉన్న రియాజాన్ నగరాల్లో ఉన్నాయి. ఈ ఫ్యాకర్టీలపై ఉక్రెయిన్ వరుసగా రెండు రోజులు రాత్రి వేళ దాడులు చేసింది. శత్రువు ఆర్థిక వనరులను దెబ్బ తీయడంంతోపాటు యుద్ధంలో ఉపయోగించే ఇంధనం కావడంతో ఉక్రెయిన్ టార్గెట్ చేస్తోంది.

రష్యాకు వ్యతిరేకంగా కైవ్‌కు ఎలా సపోర్ట్ చేయాలనే విషయంపై పశ్చిమ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పుడు ఉక్రేనియన్ భూభాగంలో దాదాపు ఐదో వంతును నియంత్రిస్తుంది. కైవ్ తన జాతీయ గుర్తింపును చెరిపివేయడానికి రూపొందించిన సామ్రాజ్య-శైలి ఆక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా తనను తాను రక్షించుకుంటున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు తమవేనని రష్యా చెబుతోంది. ఉక్రెయిన్‌కు ఇతర దేశాల సపోర్ట్‌ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో యూఎస్‌కు పరోక్షంగా అణు యుద్ధం హెచ్చరికలు పుతిన్ పంపిస్తున్నారని అంటున్నారు. అణు చర్య ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని క్రెమ్లిన్ పేర్కొంది.

Also Read: IPL 2024 Updates: కప్ కొట్టాలనే కసితో ఆర్‌సీబీ.. కొత్త స్క్వాడ్ ఇదే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News