అగ్రరాజ్యం అమెరికా.. మరోసారి భారత్ కు స్నేహహస్తం చాచింది. నిజానికి రెండు దేశాల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ఆ బంధం మరింత బలపడింది. వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు అవసరమైన ఔషధాలను భారత్ సరఫరా చేసింది. ఇప్పుడు అగ్రరాజ్యం వంతు వచ్చింది.
అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షల 70 వేలకు చేరింది. అందులో 88 వేల 199 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇటు భారత్‌లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిన్నటితో (శుక్రవారం) భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చైనాను దాటేసింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది.
తమ వద్ద ఉన్న వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమ వద్ద వెంటిలేటర్లు ఉత్పత్తి ఎక్కువగా ఉందని చెప్పారు. కాబట్టి భారత్‌లోని స్నేహితులకు వాటిని సరఫరా చేస్తామని తెలిపారు. భారత్, అమెరికా మధ్య దీంతో స్నేహబంధం మరింత బలోపేతమవుతుందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. ఐతే అమెరికా నుంచి భారత్‌కు ఎన్ని వెంటిలేటర్లు వస్తాయనే దానిపై వైట్ హౌస్ స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.
#WATCH "We are sending a lot of ventilators to India, I spoke to Prime Minister Modi. We are sending quite a few ventilators to India. We have a tremendous supply of ventilators" says US President Donald Trump. pic.twitter.com/pnvx3C1D3r
— ANI (@ANI) May 16, 2020
గతంలో కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు గేమ్ ఛేంజర్ డ్రగ్.. హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. దీంతో భారత్.. హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధంపై ఉన్న ఎగుమతి ఆంక్షలను పాక్షికంగా సడలించి దాదాపు 50 మిలియన్ల ట్యాబ్లెట్లను అగ్రరాజ్యానికి సరఫరా చేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..