US Election: ట్రంప్ కరోనాను నిర్లక్ష్యం చేశారు

US Presidential Elections 2020 | అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో డెమాక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జో బిడెన్ కు (Joe Biden ) మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) అండగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.

Last Updated : Oct 25, 2020, 07:03 PM IST
    • అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో డెమాక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జో బిడెన్ కు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అండగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.
    • ఎన్నికల గడువు తేదీ దగ్గర పడుతోండటంతో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , ఒబామా మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది.
US Election: ట్రంప్ కరోనాను నిర్లక్ష్యం చేశారు

Obama Normal President Comments | అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో ( US Presidential Elections 2020 ) డెమాక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జో బిడెన్ కు (Joe Biden ) మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) అండగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల గడువు తేదీ దగ్గర పడుతోండటంతో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఒబామా మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. 

Also Read | AP Covid-19 Updates: ఏపీలో రికార్డు స్థాయిలో సాంపిల్స్ పరీక్ష

తన తరువాత అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడిన ఒబామా ట్రంప్ దేశాన్ని కరోనావైరస్ కు ఎరగా వేశారు అని.. చాలా ఆలస్యంగా, నిర్లక్ష్యంగా స్పందించారని విమర్శించారు. ట్రంప్ నిర్లక్ష్యానికి అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు అని.. అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది అని అన్నారు. కరోనావైరస్ (Coronavirus ) వల్ల ప్రపంచంలోనే అత్యధిక మరణాలు అమెరికాలోనే జరుగుతున్నాయి అని తెలిపాడు ఒబామా.

Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 

జో బిడెన్ గెలిస్తే మనకు ఒక నార్మల్ అధ్యక్షుడు ( Normal President ) లభిస్తాడు అని తెలిపాడు ఒబామా. తనను విమర్శిస్తే జైలుకు పంపిస్తాను అని ప్రజలను హెచ్చరించే అధ్యక్షుడు కాకుండా ఒక మంచి అధ్యక్షడు దొరుకుతాడు అని తెలిపాడు. ఒక అధ్యక్షుడిగా ట్రంప్ ప్రవర్తన నార్మల్ కాదు అని అన్నాడు ఒమామా.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News