ఫన్నీ న్యూస్: పాపం గొడుగును కూడా మూయలేకపోయిన ట్రంప్ !!

చిన్న చిన్న కారణాలతో నెటిజన్లకు టార్గెట్ మారే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు నెటిజన్ల కంటపడ్డారు.

Last Updated : Oct 30, 2018, 01:10 PM IST
ఫన్నీ న్యూస్: పాపం గొడుగును కూడా మూయలేకపోయిన ట్రంప్ !!

వింత చేష్టాలతో నిరంతరం సోషల్ మీడియా దృష్టిలో పడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు నెటిజన్ల కంటపడ్డారు. కనీసం గొడుగును సైతం ట్రంప్ మూయలేక అలా వదిలెళ్లిపోయారు. తాజా ఘటన సోషల్ మీడియాలో తెగ చక్కెర్లుకొడుతోంది. ఈ సీన్ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

ఇల్లినాయిస్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ట్రంప్ విమానంలో బయలుదేరారు. ఇంతలో వర్షం కురుస్తుండటంతో గొడుగు పట్టుకుని విమానం మెట్లు ఎక్కిన వేళ ఈ ఘటన జరిగింది. విమానం లోపలికి వెళ్లే వేళ... గొడుగును మూసేందుకు సాధ్యం కాకపోవడంతో ద్వారం వద్దే దాన్ని పడేసి ట్రంప్ లోపలికి వెళ్లిపోయారు. ఈ సీన్ సోషల్ మీడియా కంటికి చిక్కి వైరల్ అవుతోంది. గతంలోనూ ట్రంప్ కు సంబంధించిన అనేక వీడియోలు పలుమార్లు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో మరోమారు వార్తల్లో నిలిచారు ట్రంప్.

 

Trending News