FDA Rejects Covaxin: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి నిరాశే, అనుమతి ఇవ్వని FDA

Bharat Biotechs covaxin: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవ‌స‌ర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేష‌న్ (FDA) అనుమతి ఇవ్వలేదు. అమెరికాలో కోవాగ్జిన్ సరఫరా కోసం ఆక్యుజెన్ అనే ఫార్మా కంపెనీతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 11, 2021, 03:38 PM IST
FDA Rejects Covaxin: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి నిరాశే, అనుమతి ఇవ్వని FDA

US FDA Delays Emergency use approval for covaxin: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన క‌రోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవ‌స‌ర వినియోగానికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేష‌న్ (FDA) అనుమతి ఇవ్వలేదు. అమెరికాలో కోవాగ్జిన్ సరఫరా కోసం ఆక్యుజెన్ అనే ఫార్మా కంపెనీతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది.

అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వకపోవడంతో పూర్తిస్థాయి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆక్యుజెన్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ అనుమతి తీసుకోవాలని భారత్ బయోటెక్, ఆక్యుజెన్ సంస్థలకు సూచించింది. ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల కోసం భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తిని అరికట్టేందుకు అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు అనుమతి రాలేదు. తాజాగా అమెరికా సంస్థలు సైతం భారత్ రూపొందించిన వ్యాక్సిన్‌కు అనుమతులపై మరింత కాలం వేచిచూసేలా చేస్తున్నాయి.

Also Read: India Corona Cases Latest News: వరుసగా నాలుగోరోజు లక్ష దిగువన కరోనా పాజిటివ్ కేసులు

ఎఫ్‌డీఏ సూచించినట్లుగా బయోలాజిక్స్ లైసెన్స్‌కు దరఖాస్తు చేయడం, పూర్తి వివరాలు సమర్పించిన తరువాత అనుమతి రావడానికి మరింత సమయం పట్టనుందని తెలుస్తోంది. అయితే తాము భారత్ బయోటెక్‌తో ఒప్పందం ప్రకారం కొవాగ్జిన్‌ కోవిడ్19 వ్యాక్సిన్‌ (Covid-19 Vaccine)ను అమెరికాలో అందుబాటులోకి తీసుకురావ‌డానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఆక్యుజెన్ సీఈవో, సహవ్యవస్థాపకులు, డాక్టర్ శంక‌ర్ ముసునూరి స్పష్టం చేశారు.

Also Read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన

భారత్‌ బయోటెక్ అందించిన కొంతమేర సమాచారంతో దరఖాస్తు చేసుకోగా అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి నిరాకరించింది. పూర్తి స్థాయిలో వివరాలు సమర్పిస్తే, క్లినికల్ ట్రయల్స్, తదితర అంశాలు పరిశీలించిన తరువాత అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నామని ఎఫ్‌డీఏ అధికారులు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News