US Presidents: అమెరికా అధ్యక్షుల గురించి ఆసక్తికర విషయాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 46 వ అధ్యక్షుడిగా జో బిడెన్ విజయం సాధించారు. ఈ నేపధ్యంలో అమెరికా ఎన్నికలంటే ప్రపంచానికెప్పుడూ ఆసక్తే. ఆ దేశాధ్యక్షులుగా పనిచేసిన కొంతమంది గురించి ఆసక్తికర విషయాలు ఇవే..

Last Updated : Nov 7, 2020, 11:34 PM IST
US Presidents: అమెరికా అధ్యక్షుల గురించి ఆసక్తికర విషయాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ( America president Elections ) 46 వ అధ్యక్షుడిగా జో బిడెన్ ( Joe Biden as 46th president ) విజయం సాధించారు. ఈ నేపధ్యంలో అమెరికా ఎన్నికలంటే ప్రపంచానికెప్పుడూ ఆసక్తే. ఆ దేశాధ్యక్షులుగా పనిచేసిన కొంతమంది గురించి ఆసక్తికర విషయాలు ఇవే.

అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump )..డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ పై విజయం సాధించారు. 1988 ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ కు అధ్యక్షుడయ్యారు. అనంతరం 1988లో ఓడిపోయారు. 

ఇక రూజ్‌వెల్ట్ ( Roosevelt ) అమెరికాకు 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 1945లో జరిగిన 22 వ రాజ్యాంగ సవరణకు ముందు ఒక వ్యక్తి అమెరికాలో ఎన్నిసార్లు అధ్యక్షుడిగా ఉండవచ్చో నిర్ణయించలేదు. అందుకే రూజ్‌వెల్ట్ 4 సార్లు,  ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ 1933 నుంచి 1945 వరకు మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 

ఇక అతి చిన్న వయస్సులోనే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైంది జాన్ ఎఫ్ కెన్నెడీ. 43 సంవత్సరాల వయసులో అధ్యక్షుడయ్యారు. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి. Also read; 46th American President: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేయనున్న తొలిపని ఇదే

ఇక రోనాల్డ్ రీగన్ ( Ronald Reagan ) రెండోసారి అధ్యక్షుడయ్యేసరికి అతని వయస్సు 73 సంవత్సరాలు. ఇప్పుడు జో బిడెన్ తో ఆ రికార్డు బ్రేక్ కానుంది. బిడెన్ వయస్సు 78 సంవత్సరాలు.  

ఇక అమెరికా ( America ) చరిత్రలో రెండుసార్లు అధ్యక్షులుగా పనిచేసిన వారిలో జార్జి వాషింగ్టన్‌, థామస్‌ జెఫర్‌ సన్‌, జేమ్స్‌ మాడిసన్‌, జేమ్స్‌ మన్రో, ఆండ్రూ జాక్సన్‌, థియోడర్‌ రూజ్‌వెల్ట్‌, విడ్రో విల్సన్‌, హ్యారీ ట్రూమ్యాన్‌, ఐసన్‌ హోవర్‌, రిచర్డ్ నిక్సన్‌, రోనాల్డ్‌ రీగన్‌, బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ ఉన్నారు. 

అమెరికా అధ్యక్షులందరిలో పొడగరిగా  అబ్రహాం లింకన్ ( Abraham lincoln ) పేరు సంపాదించారు. ఇతని పొడుగు 6 అడుగుల 4 అంగుళాలు. అమెరికా అధ్యక్షుల్లో ఓ బ్రహ్మచారి కూడా ఉన్నారు. అతనే జేమ్స్ బుకానన్. 1857 మార్చ్ నుంచి 1861 మార్చ్ వరకూ అధ్యక్షుడిగా ఉన్నారు. 

పదవీకాలంలో ఉండగా మరణించినవారు అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఉన్నారు. హెన్రీ హారిసన్, జాచరీ టేలర్, అబ్రహం లింకన్, జేమ్స్ గార్ఫీల్డ్, విలియం మక్కాన్లీ, వారెన్ హార్డింగ్, ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్, జాన్ ఎఫ్. కెన్నెడీ ( Kennedy ) లు పదవిలో ఉండగానే చనిపోయారు.

అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా తొలి ఆఫ్రో అమెరికన్ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ( Obama ) చరిత్రకెక్కారు. Also read: US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం

Trending News