Tsunami Warning: పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ

Tsunami Warning: సముద్ర గర్భంలో భారీగా భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరిక జారీ అయింది. పసిఫిక్ మహా సముద్రంలో సునామీ రావచ్చనే హెచ్చరిక ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2023, 01:31 PM IST
Tsunami Warning: పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక జారీ

Tsunami Warning: పసిఫిక్ మహా సముద్రంలో భారీగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదైంది. న్యూ కాలెడోనియా తూర్పు ప్రాంతంలో ఈ భూకంపం నమోదైందని యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఇదే ప్రాంతంలో భారీ భూకంపం సంభవించిన మరుసటిరోజే సముద్రగర్భంలో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. దాంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. 

న్యూ కాలెడోనియాకు 300 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలుస్తోంది. ఏ సునామీ కెరటాలైనా 3 మీటర్ల వరకూ ఉంటాయని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సూచించింది. సునామీ కెరటాలు పసిఫిక్ ద్వీపాలైన ఫిజి, కిరిబాటి, వనౌటు, వాలిస్, ఫ్యూట్యునాలను తాకవచ్చు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిసరాల్లోకి సునామీ హెచ్చరిక జారీ అయింది. నిన్న అంటే శుక్రవారం నాడు ఇదే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూమి కంపించింది. 

ఈ భూకంప కేంద్రం న్యూజిలాండ్‌కు ఉత్తరాన, ఆస్ట్రేలియాకు తూర్పున కేంద్రీకృతమై ఉంది. సునామీ కెరటాలు 3 మీటర్ల వరకూ ఎగిసిపడవచ్చని పసిఫికి సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిజి, న్యూ కాలెడోనియా, కిరిబాటి, న్యూజిలాండ్‌లకు సునామీ కెరటాలు చుట్టుముట్టవచ్చని సమాచారం.

Also read: Imran Khan Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News