Indo pak war : పాక్ తో యుద్ధంపై నేడే నిర్ణయం

                               

Last Updated : Feb 28, 2019, 12:05 PM IST
Indo pak war : పాక్ తో యుద్ధంపై నేడే నిర్ణయం

పాక్ కు బుద్ధిచెప్పందుకు భారత్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒకవైపు ఉగ్రమూకల ఏరివేతలో సహకరించగపోగా.. యాన్టీ టెర్రరిస్ట్ అపరేషన్ చేస్తున్న భారత్ ప్రయత్నాలను పాక్ అడ్డుకుంటోంది. పుల్వామా దాడికి ప్రతికారంగా జైషే స్థావరాలను లక్ష్యం చేకొని భారత్  సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంలో ఇంటా.. బయట ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియను భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రవేశించి ఉగ్రస్థావరాలను కూకటివేళ్లతో పీకేందుకు భారత సైన్యం చర్యలు తీసుకుంటోంది.

ఈ వ్యహారాన్ని అడ్డుపెట్టుకొని తమ భూభాగంపై భారత బలగాలు వచ్చాయని గగ్గోలుపెడుతున్న పాక్..తమ యుద్ధవిమానాలు భారత్ సరిహద్దుల్లో పంపించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో పాక్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించేందుకు ఈ రోజు కేంద్ర  కేబినెట్ అత్యవసరంగా భేటీ అవుతోంది. సాయంత్రం 6:40కి జరిగే ఈ భేటీలో ప్రధాని మోడీ తో పాటు కేబినెట్ మంత్రులంతా హాజరౌతారు. ఈ భేటీలో త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరౌతున్నట్లు తెలిసింది. 

సాయంత్రం జరిగే ఈ భేటీలో ఇండో పాక్ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పాక్ ను అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పాక్ కవ్వింపు చర్యలు రోజు రోజుకు మితిమీరుతున్న నేపథ్యంలో  ఇక యుద్ధం చేయడమే బెటర్ అనే  అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది

Trending News