King Cobra: హ్యాట్సాఫ్ భయ్యో.. కరవడానికి మీదికొస్తున్న భారీ కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో పట్టేశాడు (వీడియో)!!

థాయ్‌లాండ్‌ క్రాబిలో రోడ్డు మీదకు వచ్చిన 14 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉన్న కింగ్ కోబ్రా సూ నౌహాడ్ అనే వ్యక్తి 20 నిమిషాలు తిప్పలు పడి పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 04:25 PM IST
  • 14 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉన్న పాము
  • థాయ్‌లాండ్‌లో కింగ్ కోబ్రా హల్చల్
  • ఒట్టి చేతులతో పాముని పట్టుకున్న సూ
King Cobra: హ్యాట్సాఫ్ భయ్యో.. కరవడానికి మీదికొస్తున్న భారీ కింగ్ కోబ్రాను ఒట్టి చేతులతో పట్టేశాడు (వీడియో)!!

 Man Catch King Cobra With Bare Hands: సాధారణంగా చాలామంది చిన్న పాము (Snake) కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తి భయంతో వణికిపోతారు. ఇంకాస్త పెద్ద పాము కనబడితే ఎమన్నా ఉందా.. వెన్నులో వణుకు పుట్టి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం కళ్లముందు భారీ కింగ్ కోబ్రా (King Cobra) ఉన్నా.. కొంచెం కూడా భయపడలేదు. అది చాలా ప్రమాదకరమే కాకుండా అత్యంత విషపూరితమైనదని తెలిసినా.. ఒట్టి చేతులతో ఈజీగా పట్టేశాడు. ఈ ఘటన థాయ్‌లాండ్‌ (Thailand)లో చోటుచేసుకుంది. 

దక్షిణ థాయ్ ప్రావిన్స్ క్రాబిలో ఓ భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. 4.5 మీటర్ల (14 అడుగులు) పొడవు, 10 కిలోల బరువు ఉన్న ఆ పామును చూసి అక్కడి జనాలు భయపడిపోయారు. భారీ ఆకారంలో బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను చూసి స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఏవో నాగ్ సబ్‌డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్‌లో వాలంటీర్ అయిన సూ నౌహాడ్ (Sutee Naewhaad) అనే వ్యక్తి పామును పట్టేందుకు రంగంలోకి దిగాడు. కళ్ల ముందే భారీ కింగ్ కోబ్రా ఉన్నా అతడు అస్సలు భయపడలేదు. ముందుగా పొదల్లో ఉన్న ఆ పాముని రోడ్డు మీదకు తీసుకొచ్చాడు.

Also Read: U19 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ఆటగాడికి పాజిటివ్! కెప్టెన్ ఎవరంటే?!!

రోడ్డుమీదకు వచ్చిన కింగ్ కోబ్రా సూ నౌహాడ్ చేతికి అంత ఈజీగా చిక్కలేదు. 20 నిమిషాలు ముప్పు తిప్పలు పెట్టింది. ఒకానొక సమయంలో అతడిని కాటేయబోయింది. అయినా కూడా సూ వెనకడుగు వేయలేదు. నెమ్మదిగా పాము తల కింది భాగంను పట్టుకున్న సూ.. ఆపై తలను పట్టుకుని బంధించాడు. అయినా కూడా కింగ్ కోబ్రా బుసలు కొట్టింది. ఒట్టి చేతులతో పాముని పట్టుకున్న అతడు ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి అడవుల్లో వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో (King Cobra Video) సోషల్ మీడియాలో వైరల్ అయింది. హ్యాట్సాఫ్ భయ్యో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కింగ్ కోబ్రా ఒక విషపూరిత పాము జాతి. ఇది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. దీని సగటు పొడవు 10 నుండి 13 అడుగుల వరకు ఉంటుంది. అతిపెద్ద కింగ్ కోబ్రాలలో ఒకటి (18 అడుగుల మరియు 4 అంగుళాలు) థాయ్‌లాండ్‌లో ఉంది. ఇలాంటి పాములను పెట్టుకోవడానికి ఎవరూ ప్రయత్నించొద్దని సూ నౌహాడ్ కోరాడు. తాను ఎన్నో ఏళ్లు పాములు పట్టడంలో శిక్షణ తీసుకున్నానని, ఆ నైపుణ్యంతోనే దీనిని పట్టుకున్నానని చెప్పాడు. 

Also Read: Shyam Singha Roy: రోజీ సింగరాయ్ కోసం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌! షాక్‌లో హీరో నాని!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News