Thailand గంజాయిపై థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగుతో పాటు వినియోగాన్ని చట్టబద్ధం చేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో గంజాయిని సేవించడంతో పాటు గంజాయి వినియోగం పై నియంత్రణ విధించింది. గంజాయి మొక్కలు, పువ్వులను నార్కోటిక్ డ్రగ్స్ కేటగిరీ నుంచి తొలగిస్తున్నట్లు థాయ్‌లాండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. దీంతో గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్‌ల్యాండ్ రికార్డుకు ఎక్కింది. వైద్య, పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గంజాయి సాగను ప్రోత్సహించేందుకు త్వరలో 10 లక్షల గంజాయి మొక్కలను ప్రభుత్వమే ప్రజలకు పంపిణీ చేయనుంది.
వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నామని థాయ్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. గంజాయి సాగుతో చిన్న రైతులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగితే 3 నెలల జైలు శిక్షతో పాటు 780 డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇక ఆహార పదార్థాల్లో 0.2శాతం మాత్రమే గంజాయి వాడకం ఉండాలని నిబంధన విధించారు. దీంతో థాయ్‌ల్యాండ్ లోని పలు రెస్టారెంట్లలో గంజాయి వంటకాలను వడ్డించడం ప్రారంభించాయి. గంజాయి సాగుతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడంతో పాటు, చిన్న రైతులకు లబ్ధి చేకూరుతుందని థాయ్ ప్రభుత్వం చెబుతోంది.
also read Gold Silver Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తాజా రేట్ల వివరాలు ఇవే!
also read JOB News: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో త్వరలో 90 వేల ఉద్యోగాల భర్తీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook