Tanzanian Zanzibar After Eating Sea Turtle: కొన్ని ఫ్యాక్టరీలు తమ కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థాలను చుట్టుపక్కల ఉన్న చెరువులు, సముద్రాలలో వేస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో.. చెరువులు లేదా సముద్రంలోని నీళ్లన్ని కలుషితం అయిపోతుంటాయి. సముద్రంలో చెపలు, తాబేలు ఉంటాయి. ఈ వ్యర్థాలను తినడం వల్ల అవి కూడా కొన్నిసార్లు చనిపోతుంటాయి. సముద్రం తీరం దగ్గర చాలా సార్లు కుప్పలుగా చేపలు, ఇతర జలచర జీవులు చనిపోయి కుప్పలుగా వస్తుండటం మనం చూస్తుంటాం.
అదే విధంగా ఇళ్లలోని వ్యర్థాలను కూడా డ్రైనేజ్ లు ద్వారా దగ్గరగా ఉన్న చెరువులలోకి వదిలేస్తుంటారు. ఇలాచేయడం వల్ల కూడా కలుషితమౌతాయి. ఇలాంటి నీళ్లను తాగితే వ్యక్తులు మరణించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం తరచుగా చూస్తునే ఉంటాం. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది. తాబేలు మాంసం తిని ఏకంగా 9 మంది దుర్మరణం.. 78 మంది ఆస్పత్రిపాలైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియాలో సముద్ర తాబేళ్లను తింటుంటారు. ఇక్కడ లభించే సముద్ర తాబేళ్ల మాంసానికి ఫుల్ డిమాండ్ కూడా ఉంటుందని చెబుతుంటారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా ఇక్కడకు వచ్చి తాబేళ్ల మాంసం తింటుంటారు. అనేక రకాల ఫ్లెవర్లలో టెస్టీ మాంసం ను ఇక్కడ వండి అమ్ముతుంటారు. ఇలాంటి క్రమంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సముద్ర మాంసం తిన్న.. దాదాపు 9 మరణించగా, మరో 78 ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తూర్పు ఆఫ్రికా ఉలిక్కిపడింది.
అయితే.. తాబేలులో కిలోనిటాక్సియం అనేపదార్థం ఉంటుందని, దీని వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఇది తిన్న వారు చనిపోయి ఉండోచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)