Haibatullah Akhundzada: అఫ్గానిస్థాన్‌లో తాలితబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా (Taliban supreme leader) తొలిసారి ప్రజల మధ్యకు వచ్చినట్లు.. అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ఏడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. దీనికి హైబతుల్లా అఖుంద్ జాదా అధినేతగా (Taliban Government in Afghanistan) వ్యవహరిస్తున్నారు.
అయితే అమెరికా దళాలు అఫ్గాన్‌ను వీడినా.. అఫ్గాన్‌లో అధికారం (taliban hand over afghanistan) చేజిక్కించుకున్నా హైబతుల్లా బయటకు రాకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు హైబతుల్లా అఖుంద్ జాదా బయటకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దీనికి సంబంధిచిన ఫోటోలు, వీడియోల వంటి ఆధారాలేవి ఇవ్వలేదు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. హైబతుల్లా అఖుంద్ జాదా కాందహార్‌లోని దారుల్ ఉలుం హకిమా మదర్సాలో మాట్లాడినట్లు తాలిబన్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
Also read: North Korean leader Kim Jong Un: 'ప్రజలారా...2025 వరకు తక్కువ మెుత్తంలో ఆహారం తీసుకోండి'..
Also read: Saudi Aid To Pak : పాకిస్తాన్ కు భారీ ఆర్థిక సాయం ప్రకటించిన సౌదీ అరేబియా
హైబతుల్లా అఖుంద్జాదా ప్రసంగంలో ఏముంది?
హైబతుల్లా అఖుంద్జాదా తన ప్రసంగలో తాలిబన్ నాయకత్వం గురించి తప్పా.. రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదని తెలిసింది. అఫ్గాన్‌లో సంక్షోభం (Afghanistan Crisis) ముగిసిపోవాలని ఆయన ఆకాంక్షించినట్లు వెల్లడైంది.
Also read: Iraq: ఇరాక్‌లో ఉగ్రదాడి.. 11 మంది మృతి, ఆరుగురికి గాయాలు
హైబతుల్లా అజ్ఞాతంపై అనుమానాలు ఇలా..
2016లో అప్పటి తాలిబన్ సుప్రీం లీటర్ ముల్లా అక్తర్ మన్సూర్‌ను (Mullah Akhtar Mansour) అమెరికా డ్రోన్ దాడిలో మట్టుబెట్టిన తర్వాత.. హైబతుల్లా ఆ పదవిలోకి వచ్చారు. అప్పటి నుంచి హైబతుల్లా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అతడు ఎలా ఉంటాడనేది ఎవరికి తెలిసేది కాదు. తాలిబన్లే స్వయంగా అతడి ఛాయాచిత్రం విడుదల చేశారు. అప్పటి వరకు చాలా మందికి అతడి గురించి తెలియదు.
అయితే రహస్య జీవితం గడుపుతున్న అకుంద్జాదాపై అప్పట్లో పలు వదంతులు వచ్చాయి. అతడు కరోనాతో చనిపోయాడని కూడా ప్రచారం సాగింది. అయితే తాలిబన్లు చేసిన తాజా ప్రకటనతో ఆ అనుమానాలకు తెలపడింది.
Also read: terrorists attack: అమెరికాకు పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు
Also read: Pakistan vs Talibans: తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య విమాన సర్వీసుల వివాదం, నిలిచిన సర్వీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి