Shinzo Abe killer Tetsuya Yamagami says Dissatisfied with him: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 8) నరా నగరంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న షింజోపై ఓ దుండగుడు అతి సమీపం నుంచి జరిగిన కాల్పులలో ఆయన మృతి చెందారు. సమర్థవంతమైన నేతగా, అజాత శత్రువుగా పేరున్న షింజోపై దాడి జరగడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. అబే మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రౌండ్ల కాల్పుల అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అతడిని ఘటనా స్థలంలోనే పట్టుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఓ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగుడు నరా నగరానికి చెందిన 41 ఏళ్ల యమగామి ఎట్సుయాగా పోలీసులు గుర్తించారు. యమగామి గతంలో సైన్యంలో మూడేళ్ల (2002-2005) పాటు పని చేశాడట. మెరైన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో ఉన్నాడట.
పోలీసుల ఎదుట యమగామి ఎట్సుయా నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. షింజో అబేను చంపాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపినట్లు నిందితుడు దర్యాప్తులో చెప్పినట్లు జపాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అబేపై తాను తీవ్ర అసంతృప్తిగా ఉన్నానని, అందుకే హత్య చేశానని చెప్పాడట. అయితే రాజకీయంగా అబేపై తనకు ఎలాంటి పగ లేదని నిందితుడు యమగామి చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Former Japanese Prime Minister Shinzo Abe gravely injured in shooting.
The man in the khaki shirt is the arrested criminal.
Is this a shotgun? pic.twitter.com/0KTbVbEycv— ヤニだるま (@yanidatuma29) July 8, 2022
కాల్పుల కోసం యమగామి ఎట్సుయా దేశీయ తుపాకీని వినియోగించినట్లు తెలుస్తోంది. యమగామిని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఈ ఘటన అనంతరం యమగామి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. అతడి గదిలో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. తుపాకీని అతడే స్వయంగా తయారు చేసుకున్నట్లు సమాచారం. అయితే తుపాకీ తయారీకి కావాల్సిన సామాగ్రిని యమగామి ఎక్కడి నుంచి సేకరించాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Shinzo Abe Dies: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి.. పట్టుబడిన షూటర్! ఫొటోస్ ఇవే
Also Read: Kareena Kapoor Prabhas: టాలీవుడ్ స్టార్ హీరోకు జోడీగా కరీనా కపూర్!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Shinzo Abe Death: జపాన్ మాజీ ప్రధానిని అందుకే చంపా.. సంచనల విషయం చెప్పిన షూటర్!
పోలీసుల అదుపులో యమగామి
జపాన్ మాజీ ప్రధానిని అందుకే చంపా
సంచనల విషయం చెప్పిన షూటర్