Shanghai lockdown: చైనాలో కొవిడ్ భయాలు- నిర్బందంలో షాంఘై ప్రజలు!

Shanghai lockdown: చైనాలో మరోసారి కొవిడ్ కోరలు చాస్తోంది. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. దీనితో వివిధ నగరాల్లో లాక్​డౌన్ విధించింది ప్రభుత్వం. ముఖ్యంగా షాంఘైలో లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 11:49 PM IST
  • చైనాలో కొవిడ్ కోరలు
  • షాంఘైలో భారీగా కేసులు
  • కఠిన లాక్​డౌన్​లో ఆర్థిక రాజధాని
Shanghai lockdown: చైనాలో కొవిడ్ భయాలు- నిర్బందంలో షాంఘై ప్రజలు!

Shanghai lockdown: చైనాలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. వివిధ నగరాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కట్టడి చర్యలు ప్రారంభించింది స్థానిక యంత్రాంగం. ముఖ్యంగా చైనా ఆర్థిక రాజధాని, అత్యధిక జనాభా ఉన్న షాంఘైలో లాక్​డౌన్ విధించింది స్థానిక యంత్రాంగం. రోజువారీ సగటు కేసుల సంఖ్య 4,400 దాటిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది స్థానిక ప్రభుత్వం.

ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 2.6 కోట్లమంది వరుసగా రెండో రోజు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించడం ఇందుకు కారణం.

షాంఘైలో ప్రపంచ ఆరోగ్య ప్రమాణాలతో పోలిస్తే.. మాడ్రెట్​గా ఉన్నాయి. సోమవారం లెక్కల ప్రకార.. 4,381 కేసులు నమోదయ్యాయి.

చాలా ప్రాంతాల్లో ఇళ్లను వదిలి ప్రజలు బయటకు రావడం లేదని తెలిసింది. ఇదిలా ఉండాగా.. మరికొంత మంది మాత్రం తమ కాంపౌట్లలో తిరిగుతు కనిపించారని స్థానికులు కొంతమంది మీడియాతో చెప్పినట్లు వెల్లడైంది. అయితే అధికరులు మాత్రం ఆపర్ట్​మెంట్​లలో ఉండే వారెవ్వరూ తమ ఇంట్లో నుంచి బయటకుకు రావద్దని అధికారులు సూచించారు. కనీసం పెంపుడు కుక్కలను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లేందుకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇక షాంఘైలో మాస్ టెస్టింగ్ జరగుతోందని అధికారులు వెల్లడించారు. నగరంలో మొత్తం 17,000 మంది హెల్త్​కేర్ వర్కర్లు టెస్టులు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు మొత్తం 82 లక్షల మందికి టెస్టులు చేసినట్లు పేర్కొన్నారు.

Also read: Mexico Shootout: మెక్సికోలో కాల్పుల బీభత్సం... 19 మంది మృతి...

Also read: Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్య కుట్ర భగ్నం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News