terrorists attack: అమెరికాకు పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు

ISIS could be capable of attacking US next year రాబోయే పన్నెండు నెలల్లో అమెరికాలో ఇస్లామిక్‌ స్టేట్‌ దాడికి తెలిపారు. అఫ్గాన్‌లో సుదీర్ఘ యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఇప్పటికీ ఆ దేశం నుంచే తీవ్రమైన ముప్పు పొంచి ఉందంటూ పెంటగాన్‌ అధికారులు పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 12:16 PM IST
  • పుంజుకుంటోన్న అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రసంస్థలు
  • అమెరికాపై దాడికి ప్రయత్నం
  • పెంటగాన్‌ సీనియర్‌ అధికారి వెల్లడి
terrorists attack: అమెరికాకు పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు

Senior Pentagon official says ISIS-K could be capable of attacking US next year : ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యం నెరవేరిందంటూ అఫ్గాన్ నుంచి వెళ్లిపోయింది అమెరికా. అయితే యూఎస్ అంచనా లెక్క తప్పింది. అమెరికా సేనలు వెళ్లడమే ఆలస్యం.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తాలిబన్లు ఏకంగా దేశాన్ని ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అల్‌ఖైదా, (Al Qaeda) ఇస్లామిక్‌ స్టేట్‌ (Islamic State) వంటి ఉగ్రసంస్థలు మళ్లీ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

అమెరికా నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఇక అఫ్గాన్‌ భూభాగం నుంచి యూఎస్‌కు ఉగ్ర ముప్పు (terrorist attack) పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

రాబోయే పన్నెండు నెలల్లో అమెరికాలో ఇస్లామిక్‌ స్టేట్‌ దాడికి యత్నించే అవకాశముందంటూ పెంటగాన్‌ సీనియర్‌ అధికారి (Senior Pentagon official) తెలిపారు. అఫ్గాన్‌లో (Afghan) సుదీర్ఘ యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఇప్పటికీ ఆ దేశం నుంచే తీవ్రమైన ముప్పు పొంచి ఉందంటూ పెంటగాన్‌ అధికారులు పేర్కొన్నారు. 

Also Read : Jr NTR: బాలీవుడ్ బడా డైరెక్టర్ తో జూ.ఎన్టీఆర్ చిత్రం...టైటిల్ ఇదే..!

ఇస్లామిక్‌ స్టేట్‌లో కొన్ని వేల మంది టెర్రరిస్టులు (terrorists) ఉన్నారని, ఆరు నెలల్లో అమెరికాపై దాడి చేసేలా ఆ సంస్థ తన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందంటూ పెంటగాన్‌ అధికారులు వెల్లడించారు. 

అలాగే ఆల్‌ఖైదా నుంచి కూడా మరోసారి అమెరికాకు (US) సమస్య ఉందని తెలిపారు. తాలిబన్ల సంరక్షణలో అఫ్గాన్‌ గడ్డపై అల్‌ఖైదా మళ్లీ పుంజుకొనే అవకాశం ఉందని తెలిపారు. రానున్న ఒకట్రెండు ఏళ్లలో అమెరికా (America) భూభాగంపై దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Also Read : Mutton: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆంత్రాక్స్‌.. మటన్ కొనే ముందు ఇవి చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News